KXIP vs CSK: కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు... చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్...

Published : Oct 04, 2020, 09:15 PM ISTUpdated : Oct 04, 2020, 09:18 PM IST
KXIP vs CSK: కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు... చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్...

సారాంశం

మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కెఎల్ రాహుల్... నికోలస్ పూరన్, మన్‌దీప్, మయాంక్ మెరుపులు...  వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి మరోసారి మొదటి వికెట్‌కి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 61 పరుగులు జోడించిన తర్వాత 19 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ కాగా... మన్‌దీప్ సింగ్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

17 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసిన నికోలస్ పూరన్, 52 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ వెంటవెంటనే అవుట్ కావడంతో పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. ఆఖరి ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు బాదడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... శార్దూల్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయగా పియూష్ చావ్లా, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది.

PREV
click me!

Recommended Stories

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?