వింటేజ్ లుక్‌లో సూపర్‌స్టార్‌లా మెరిసిపోతున్న ఎమ్మెస్ ధోనీ.. ఈ కటౌట్‌తో ఓ సినిమా పడితే..

By Chinthakindhi RamuFirst Published Oct 3, 2023, 3:51 PM IST
Highlights

ఎమ్మెస్ ధోనీ కొత్త స్టైలిష్ లుక్‌ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసిన సెలబ్రిటీ హెయిర్ స్టైయిలిష్ ఆలీమ్ హకీం...

క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ మాస్ ఫాలోయింగ్ రేంజ్ వేరు. జార్ఖండ్ నుంచి వచ్చిన మాహీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెటర్‌గానే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా కూడా మాహీకి ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ ఉంది..

జులపాల జట్టుతో ఎంట్రీ ఇచ్చిన మాహీ హెయిర్‌స్టైల్‌ని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరు హీరోలు ఫాలో కావాల్సి వచ్చింది. దీపికా పదుకొనే కోసం జులపాల జట్టు నుంచి షార్ట్ హెయిర్ స్టైల్‌లోకి వచ్చేసిన ఎమ్మెస్ ధోనీ, చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్‌లో దర్శనమిచ్చాడు..

Latest Videos

సెలబ్రిటీ హెయిర్ స్టైయిలిష్ ఆలీమ్ హకీం, ఎమ్మెస్ ధోనీ కొత్త స్టైలిష్ లుక్‌ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశాడు. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఎమ్మెస్ ధోనీ లుక్‌ని, మహేష్ బాబుతో పోలిస్తున్నారు కొందరు మ్యూచువల్ ఫ్యాన్స్.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

ఇలాంటి మాస్ లుక్‌లో మాహీ ఓ యాక్షన్ మూవీ చేస్తే, క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలినట్టే, సినిమా ప్రపంచాన్ని కూడా ఏలడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు ధోనీ వీరాభిమానులు.. 

 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2021 నుంచి ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయి.  గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో ఇబ్బంది పడిన మహేంద్ర సింగ్ ధోనీ, కొంత కాలం కిందట మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎమ్మెస్ ధోనీయే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

click me!