ఎమోషనల్ అయిన సాయికిషోర్... ఒక్క సెంచరీకి రెండు సార్లు సెలబ్రేట్ చేసుకున్న యశస్వి జైస్వాల్..

By Chinthakindhi Ramu  |  First Published Oct 3, 2023, 2:26 PM IST

మొదటి మ్యాచ్ సందర్భంగా భావోద్వేగానికి లోనైన సాయికిషోర్.. నేపాల్‌తో మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జితేశ్ శర్మ, సాయికిషోర్.. 


ఐపీఎల్‌లో ఎన్ని మ్యాచులు ఆడినా, అంతర్జాతీయ జట్టుకి ఆడే అవకాశం రావడం చాలా స్పెషల్. తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచి ఐపీఎల్‌కి, అటు నుంచి ఆసియా క్రీడల్లో టీమిండియాకి ఆడే అవకాశం దక్కించుకున్నాడు తమిళనాడు కుర్రాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్... 

ఆసియా క్రీడల్లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సాయి కిషోర్, జాతీయ గీతాలాపాన సమయంలో ఎమోషనల్ అయ్యాడు. జనగణ మన పాడుతున్న సమయంలో సాయికిషోర్ భావోద్వేగానికి లోనై, కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..

Emotions aplenty as Sai Kishore swelled up during the national anthem of 🇮🇳, making his T20I debut today 🆚🇳🇵

Drop a 💙 if you believe hard work always pays off 🙌💯 pic.twitter.com/x9fdZjIGg2

— Sony LIV (@SonyLIV)

Latest Videos

undefined


26 ఏళ్ల సాయికిషోర్, దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతున్నా, ఐపీఎల్‌లోకి రావడానికి 2022 వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్న రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, 2022 ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు..

ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్, 25 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి ఇంప్రెస్ చేశాడు సాయికిషోర్..

ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసి, అతి చిన్న వయసులో అంతర్జాతీయ టీ20 సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన యశస్వి జైస్వాల్.. రెండు సార్లు సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకోవడం విశేషం. 16వ ఓవర్‌లో ఫోర్ బాదిన యశస్వి జైస్వాల్, అది బౌండరీ అవతల పడిందని అనుకుని హెల్మెట్ తీసి సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే అంపైర్ ఫోర్ ఇవ్వడంతో అసలు విషయం తెలుసుకుని, నాలుక కరుచుకున్న జైస్వాల్.. తర్వాతి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు..

సెంచరీ పూర్తయిన తర్వాత మరోసారి హెల్మెట్ తీసి సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్.. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో 4, 6, 4, 1, 6, 2 బాదిన రింకూ సింగ్ 23 పరుగులు రాబట్టాడు. ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్‌పై హంగ్‌కాంగ్‌పై 26 పరుగులు రాబట్టగా అతని తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు రింకూ సింగ్. 
 

click me!