ధోనీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ఇదేనట..

By telugu teamFirst Published Nov 27, 2019, 12:42 PM IST
Highlights

సాధారణంగా మంచి భర్త అనిపించుకోవడం చాలా కష్టమైన పని అని మగవారంతా ఫీలౌతుంటారు. పెళ్లి అంటేనే నరకం.. పెళ్లాం అంటే రాక్షసి లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటివారందరికీ.. ధోనీ ఓ సలహా ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే... ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతున్నాడు. తన హ్యాపీ లైఫ్ సీక్రెట్ ని ధోనీ బయటపెట్టాడు.
 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బెస్ట్ వికెట్ కీపర్ అని... కెప్టెన్ కూల్ ఇలా చాలా బిరుదులే ఉన్నాయి.  కేవలం ధోనీ అంటే క్రికెట్ గురించే కాదు... ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులు ఆసక్తిగా చూపిస్తుంటారు. ఒకానొక సమయంలో... ధోనీ తన భార్య సాక్షి ధోనీ కాలికి చెప్పులు కూడా తొడిగారు. ఆ సమయంలో అమ్మాయిలంతా ఎంత మంచి భర్త అంటూ ధోనీపై ప్రశంసలు కురిపించారు. ఇక తన కూతురు జీవాతో కూడా ధోనీ వీలైనంత సమయం గుడుపుతూ మంచి ఫాదర్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నారు. 

AlsoRead WI vs IND T20: జట్టుకి శిఖర్ థావన్ దూరం.. సంజు శాంసన్ కి అవకాశం..?...

సాధారణంగా మంచి భర్త అనిపించుకోవడం చాలా కష్టమైన పని అని మగవారంతా ఫీలౌతుంటారు. పెళ్లి అంటేనే నరకం.. పెళ్లాం అంటే రాక్షసి లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటివారందరికీ.. ధోనీ ఓ సలహా ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే... ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతున్నాడు. తన హ్యాపీ లైఫ్ సీక్రెట్ ని ధోనీ బయటపెట్టాడు.

‘‘ పెళ్లికి ముందు అందరు మగాళ్లు సింహాలే. పెళ్లి అసలు విలువ, రుచి.. మనకు 55ఏళ్లు దాటిన తర్వాతే తెలుస్తాయి. నా భార్యకు ఏది చేయాలని అనిపిస్తే.. నేను అది చేయనిస్తాను. ఎలాంటి అభ్యంతరాలు పెట్టను. ఎందుకంటే.. తాను హ్యాపీ గా ఉంటేనే... నేను కూడా హ్యాపీగా ఉంటాను’’ అంటూ తన అసలు సీక్రెట్ ని ధోనీ బయటపెట్టాడు.

AlsoRead ధోనీ భవిష్యత్తు... వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే.....

ఇక ధోనీ కెరిర్ విషయానికి వస్తే... ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టింది లేదు. దీంతో ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే... వచ్చే ఐపీఎల్ తర్వాతే ధోనీ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘‘ ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకుంటే అది వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే. అతడు చాలా పెద్ద ఆటగాడు.  కాబట్టి అతడిపై ఊహాగానాలను ఆపలేం. ఇప్పుడతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు. నెల రోజులుగా కఠోర సాధన చేస్తున్నాడు’’ అని ధోనీ సన్నిహితుడు ఒకరు చెప్పారు.

కాగా...ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి కూడా తాజాగా స్పందించారు.  2020 ఐపీఎల్ లో ధోనీ ఎలా ఆడతాడు అనే దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ధోనీ క్రికెట్ ఆడటం తదిరిగి ఎప్పుడు మొదలుపెడతాడు, వచ్చే ఐపీఎల్ లో అతను ఎలా ఆడతాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నారు,

ఇతరులు వికెట్ కీపింగ్ లో ఎలా రాణిస్తారు, ధోనీతో పోలిస్తే వాళ్ల ఫామ్ ఎలా ఉందన్నది కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ అయిపోయిందన్నారు. ఆ టోర్నీ తర్వాతే 15మంది జట్టు పై అటూ ఇటుగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని  ఆయన అన్నారు.
 

click me!