WI vs IND T20: జట్టుకి శిఖర్ థావన్ దూరం.. సంజు శాంసన్ కి అవకాశం..?

Published : Nov 27, 2019, 11:45 AM ISTUpdated : Nov 27, 2019, 12:05 PM IST
WI vs IND  T20: జట్టుకి శిఖర్ థావన్ దూరం.. సంజు శాంసన్ కి అవకాశం..?

సారాంశం

ఓ నాలుగు, ఐదు రోజుల్లో గాయం తగ్గిపోతుందని తిరిగి జట్టులోకి వస్తాడని తొలుత అందరూ భావించారు. అయితే... ధావన్ కోలుకోవడానికి మరింత సమయమ పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.   


వెస్టిండీస్ తో త్వరలో టీమిండియా టీ20 కోసం తలపడనుంది. మరి కొద్ది రోజుల్లో మ్యాచ్ అనగా...టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ సిరీస్ కి దూరం కానున్నాడు. వెస్టిండీస్ తో డిసెంబర్ 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. కాగా...  ఈ సీరిస్ కి ధావన్ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి.

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో ధావన్ మోకాలికి గాయమైంది. క్రీజును చేరుకునే సమయంలో డైవ్ చేయడంతో ధావన్ మోకాలికి గాయమైంది. వెంటనే అతనిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో దిగిన ఫోటోలను కూడా ధావన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.\

ఓ నాలుగు, ఐదు రోజుల్లో గాయం తగ్గిపోతుందని తిరిగి జట్టులోకి వస్తాడని తొలుత అందరూ భావించారు. అయితే... ధావన్ కోలుకోవడానికి మరింత సమయమ పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

AlsoRead ధోనీ భవిష్యత్తు... వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే.....

కాగా, ధావన్ స్థానంలో కేరళ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌కు సంజూ శాంసన్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడదు. ఫలితంగా సిరిస్ మొత్తం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. 

కాగా... సంజూ శాంసన్ ని ఎంపిక చేసి కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేయడం పట్ల పలురు క్రికెట్ అభిమానులు, సీనియర్ క్రికెటర్ హర్భజన్ లాంటి వాళ్లు కూడా మండిపడ్డారు. ఏకంగా సెలక్షన్ కమిటీనే మార్చేయాలాంటూ హర్భజన్ కామెంట్స్ చేశారు. కాగా... ఇప్పుడు శిఖర్ ధావన్ గాయం కారణంగా సంజు శాంసన్ కి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.  

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం