చందమామపై చంద్రయాన్ 3 ల్యాండింగ్..జీవా రియాక్షన్ వైరల్..!

By telugu news teamFirst Published Aug 24, 2023, 9:45 AM IST
Highlights

ఈ ఆనందంలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముద్దుల కుమార్తె జీవా కూడా పాల్గొంది.
 

భారత రోదసి చరిత్రలో అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన ఘనతను భారత ఇస్రో అందుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్ సురక్షితంగా దిగింది. ఈ  ఘటనతో భారతీయులంతా సంబరాలు చేసుకున్నారు. చంద్రయాన్ చంద్రుడి ఉపరితలంపైకి చేరడాన్ని అందరూ లైవ్ లో వీక్షించారు.

ఈ విజయాన్ని భారతీయులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, చంద్రయాన్ 3 గురించే కనపడుతోంది. ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కాగా, ఈ ఆనందంలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముద్దుల కుమార్తె జీవా కూడా పాల్గొంది.

Latest Videos

వాళ్ల ఇంటిలో టీవీ చంద్రయాన్ చందమామ పై చేరడాన్ని జీవా లైవ్ లో వీక్షించింది. ఆ సమయంలో జీవా రియాక్షన్  ని వీడియో రూపంలో క్యాప్చర్ చేసిన సాక్షి ధోనీ, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


చారిత్రాత్మక  ఘట్టం ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 5.20 గంటలకు ప్రారంభమైంది  ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగడానికి ముందు నాలుగు దశలను పూర్తి చేసింది.

ప్రతి దశలో, విక్రమ్ నెమ్మదిగా చంద్రుని వైపుకు కదిలింది. ప్రతి విజయవంతమైన దశ మిషన్ కంట్రోల్ రూమ్‌లో ఇస్రో అధికారుల నుండి వేడుకలను చూసింది.ఎట్టకేలకు అది చంద్రుడిపైకి దిగడంతో అధికారులంతా ఆనందంలో మునిగిపోయారు. దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా చేరి ఇస్రో బృందాన్ని అభినందించారు.

Ziva 🤣❤️ pic.twitter.com/y4LfWAFpHg

— 𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬𝐌𝐒𝐃𝐢𝐚𝐧™ (@Itzshreyas07)

 

బ్రిక్స్ సదస్సుకు హాజరైన దక్షిణాఫ్రికా నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇలా అన్నారు: ‘ ఇవి చిరస్మరణీయమైన క్షణాలు. భూమ్మీద బారత్ ఓ సంకల్పం చేసింది. చంద్రునిపై ఇది సాధించింది. ఈ విజయం యావత్తు మానవాళిది. నేనిప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నా, నా మనసంతా భారత్ లోనే ఉంది’ అని పేర్కొన్నారు.
 

click me!