ఫాస్ట్ బౌలింగ్: ధోనీని తప్పు పట్టిన ఇషాంత్ శర్మ

By telugu teamFirst Published Dec 29, 2019, 12:44 PM IST
Highlights

ధోనీ నాయకత్వంలో తరుచుగా రొటేట్ చేయడం వల్ల ఫాస్ట్ బౌలర్లు నిలకడగా రాణించలేకపోయారని ఇషాంత్ శర్మ అన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు తగిన అనుభవం లేకపోవడం కూడా మరో కారణమని ఇషాంత్ అన్నాడు.

హైదరాబాద్: కొన్నేళ్లుగా ఇషాంత్ శర్మ భారత ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఒక పిల్లర్ గా ముందుకు వచ్చాడు. 31 ఏళ్ల ఇషాంత్ 2007లో 2007లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి ప్రవేశించాడు. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో అతను అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల నాయకత్వాల్లోని జట్లలో ఉంటూ వచ్చాడు. 

సంప్రదాయబద్దంగా స్నిన్ బౌలింగుకు పేరు మోసిన భారత్ ఆ తర్వాత పేస్ లోనూ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ మార్పునకు కారణం అడిగినప్పుడు.. సరైన అనుభవం లేకపోవడం వల్ల, ఎక్కువగా రొటేట్ చేయడం వల్ల ధోనీ నాయకత్వంలో పైస్ బౌలర్లు నిలకడను సాధించలేకపోయారని చెప్పాడు.

ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు తమలో చాలా మందికి అనుభవం లేదని, అంతేకాకుండా ఫాస్ట్ బౌలర్లను తరుచుగా రొటేట్ చేస్తూ వచ్చారని, అందువల్ల నిలకడగా రాణించలేకపోయామని ఇషాంత్ చెప్పాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ హైదరాబాదును ఓడించిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.

మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ పూల్ లో ఆరేడుగురు బౌలర్లు ఉండేవారని దాంతో సమాచార వినిమయంలో లోపం ఉండేదని, ఇప్పుడు ముగ్గురు నలుగురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారని, దాంతో వారి మధ్య మంచి సమన్వయం ఉందని చెప్పాడు. 

జస్ ప్రీత్ బుమ్రాతో కలిపి ముగ్గురు నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, అది సమాచార వినిమయానికి వెసులుబాటు కల్పిస్తుందని, ఇంతకు ముందు ఆరేడుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండడం వల్ల సమాచార వినిమయం జరిగేది కాదని అన్నాడు. 

విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించేటప్పటికి ఫాస్ట్ బౌలర్లలో అనుభవం పెరిగిందని, అది ఎంతో లాభించిందని ఇషాంత్ చెప్పాడు. కుటుంబ సభ్యులతో కన్నా డ్రెసింగ్ రూంలో ఎక్కువగా గడపడం వల్ల కూడా నిరాశకు గురవుతున్న ఆటగాళ్లు కలిసికట్టుగా వినోదం పంచుకోవడానికి, రాణించడానికి సాయపడుతోందని అన్నాడు. 

ఎక్కువగా ఆడినప్పుడు కుటుంబ సభ్యులతో కన్నా జట్టు సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతామని, చర్చలు స్వేచ్ఛగా అరమరికలు లేకుండా జరుగుతాయని, అప్పుడు వినోదించడం ప్రారంభిస్తామని, మైదానంలోకి దిగినప్పుడు అది పూర్తిగా విభిన్నమైన భావనను అందిస్తుందని చెప్పాడు. 

click me!