న్యూలుక్ లో అధరగొడుతున్న ధోనీ.. పండగ చేసుకుంటున్న అభిమానులు

Published : Jul 18, 2020, 01:03 PM IST
న్యూలుక్ లో అధరగొడుతున్న ధోనీ.. పండగ చేసుకుంటున్న అభిమానులు

సారాంశం

తాజాగా ధోనీ సోషల్ మీడియా ముందుకు వచ్చారు. శుక్రవారం నాడు ధోనీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. దీంతో ఇది వైరల్ అయింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆయన చాలా రోజుల తర్వాత కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఎప్పుడూ సోషల్ మీడియాకి ధోనీ దూరంగానే ఉంటారు. ఆయనకు సంబంధించిన విషయాలను భార్య సాక్షి నే.. వివరిస్తూ ఉంటుంది. ఆయన ఫోటోలు, కూతురి ఫోటోలను కూడా సాక్షినే షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే.. తాజాగా ధోనీ సోషల్ మీడియా ముందుకు వచ్చారు. శుక్రవారం నాడు ధోనీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. దీంతో ఇది వైరల్ అయింది.

 

ఈ లుక్ లో ధోనీ తన వయసును కాస్తంత తగ్గించుకున్నట్టు కనిపించాడు. ఎవరితోనో వీడియో కాల్ లో హాయ్ చెబుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ వీడియోను, ధోనీ రూపాన్ని చూసిన ఫ్యాన్స్, తమ స్టార్ ఆటగాడు తిరిగి గ్రౌండ్ లోకి దిగేందుకు సిద్ధమైపోయాడని కామెంట్లు పెడుతున్నారు. కాగా, గత సంవత్సరం జూలై తరువాత ధోనీ ఇంతవరకూ బ్యాట్ ను పట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగితే, ధోనీని క్రికెట్ మైదానంలో తిరిగి చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !