క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు... పాక్‌తో టీ20 మ్యాచ్‌లో ఘటన...

Published : Jul 03, 2021, 11:35 AM IST
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు... పాక్‌తో టీ20 మ్యాచ్‌లో ఘటన...

సారాంశం

వెస్టిండీస్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భయానక దృశ్యాలు... మైదానంలో కుప్పకూలిన వెస్టిండీస్‌ ప్లేయర్లు చిన్నెల్లీ హెన్రీ, చెడీన్ నేషన్... ఆసుపత్రికి తరలింపు...

వెస్టిండీస్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఇద్దరు మహిళా క్రికెటర్లు ఆకస్మాత్తుగా క్రీజులోనే కుప్పకూలిపోయారు. వెస్టిండీస్‌ ప్లేయర్లు చిన్నెల్లీ హెన్రీ, చెడీన్ నేషన్... మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే క్రీజులో పడిపోవడంతో ఇద్దరికీ హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి... ఇద్దరు ప్లేయర్లు పడిపోవడంతో మరో ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను బరిలో దింపి, మ్యాచ్‌ను పూర్తి చేయించింది వెస్టిండీస్ జట్టు. ఈ మ్యాచ్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.

గాయపడిన చెడీన్ నేషన్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేయగా, చిన్నెల్లీ హెన్రీ ఒక్క పరుగుకే అవుట్ అయ్యిందిపాకి. స్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది.

దీంతో కాస్త ఆలస్యంగా ప్రారంభమైన రెండో ఇన్నింగ్స్‌లో పాక్ లక్ష్యాన్ని డీఆర్‌ఎస్ పద్ధతిలో 18 ఓవర్లలో 113 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు. అయితే పాక్ మహిళా జట్టులో నలుగురు ప్లేయర్లు రనౌట్ కావడంతో 103 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓడింది.

PREV
click me!

Recommended Stories

సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?
గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!