ధోనీ బైక్ కలెక్షన్ పై సాక్షి రియాక్షన్ ఇదే..!

By telugu news teamFirst Published Jul 19, 2023, 9:53 AM IST
Highlights

దానిని తన గ్యారేజ్ లో ఉంచుకునే వరకు నిద్రపోయేవారు కాదు. ఇప్పటి వరకు ఆయన వద్ద దాదాపు 100 కంటే ఎక్కువ బైక్ లు ఉన్నాయంటే నమ్మగలరా?

మహేంద్ర సింగ్ ధోని ఇది పేరు కాదు ఒక బ్రాండ్. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మైదానంలోకి అడుగుపెడితే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఆయన బ్యాటింగ్ పొజిషన్ రావడం కోసం ముందు ఉన్న క్రికెటర్లు అవుట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఆయన అంటే క్రేజ్ అలా ఉంటుంది మరి.

అయితే, ధోనీ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, బైక్ రైడింగ్ అంటే కూడా అంతే ఇష్టం. ఆయన దగ్గర చాలా బైక్ కలెక్షన్లు కూడా ఉన్నాయి. ఆయనకు ఒక బైక్ నచ్చింది అంటే చాలు, దానిని తన గ్యారేజ్ లో ఉంచుకునే వరకు నిద్రపోయేవారు కాదు. ఇప్పటి వరకు ఆయన వద్ద దాదాపు 100 కంటే ఎక్కువ బైక్ లు ఉన్నాయంటే నమ్మగలరా?

Latest Videos

ధోనీ తన రాంచీలోని ఫామ్ హౌస్ లో ఈ బైక్ కలెక్షన్లు పెట్టుకోవడం విశేషం.. భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ధోనీ బైక్ కలెక్షన్‌ను చూసి, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ధోనీ తన ఫామ్‌హౌస్‌లో అనేక బైక్‌లను కలిగి ఉన్నాడని చాలా కాలంగా తెలిసినప్పటికీ, ప్రసాద్ షేర్ చేసిన వీడియో నిజమైన మోటర్‌బైక్‌ల సంఖ్య 100 కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.

ధోని గ్యారేజ్ ను వీడియో తీసి వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో గ్యారేజ్ లో ధోని సేకరించిన కొత్త, పాత బైక్ లు, రకరకాల మోడల్ కార్లను చూడొచ్చు. కొన్ని కార్లను ధోని విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని, ఇంకొన్నింటిని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేశారని తెలుస్తోంది. బైక్ లను సేకరించడం మాత్రమే కాదు.. వాటికి తరచుగా సర్వీసింగ్ కూడా స్వయంగా ధోనీయే చేస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పోస్టు చేస్తుంటారు.

One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house.
Just blown away by the man and his passion pic.twitter.com/avtYwVNNOz

— Venkatesh Prasad (@venkateshprasad)

 

ఇది ఇంట్లో బైక్ ఉన్నట్లుగా లేదని, ఓ బైక్ షోరూమ్ లా ఉందని వెంకటేష్ ప్రసాద్ అన్నారు. కాగా, దానికి వెంటనే సాక్షి స్పందించారు. తాను కూడా ధోనీని అదే అడుగుుతూ ఉంటానని, ఇన్ని బైకులు అవసరమా మహి అంటానని అన్నారు.

దానికి ధోనీ చెప్పిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉండటం గమనార్హం.  ‘ ఎందుకంటే నాకు సంబంధించినవి అన్నీ నువ్వూ తీసుకుంటున్నావ్, నాకంటూ ఓ ప్రదేశం ఉండాలి కదా, అయినా నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చింది ఇదొక్కటే కదా’ అంటూ సమాధానం ఇవ్వడం విశేషం.

click me!