రిషబ్ పంత్‌ లైవ్‌లోకి మాహీ భాయ్... సాక్షితో అలా అనగానే కాల్ కట్ చేసిన ధోనీ...

By Chinthakindhi RamuFirst Published Jul 27, 2022, 10:20 AM IST
Highlights

ఇన్‌స్టా లైవ్‌లో మాహీని తీసుకొచ్చిన రిషబ్ పంత్... అలా వచ్చి, ఇలా మాయమైన మహేంద్ర సింగ్ ధోనీ...  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో...

ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న భారత కీ ప్లేయర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్... వెస్టిండీస్‌ చేరుకున్నారు. వెస్టిండీస్‌ చేరుకున్న తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ద్వారా తన టీమ్ మేట్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్‌తో మాట్లాడాడు రిషబ్ పంత్. ఈ లైవ్‌లోకి కాసేపు మహేంద్ర సింగ్ ధోనీ కూడా వచ్చి, అలా మాయమయ్యాడు...

రిషబ్ పంత్ ఎప్పటిలానే సరదా కామెంట్లతో అందరినీ ఆటపట్టిస్తుంటాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ లైవ్‌లో ఉన్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా జత చేశాడు రిషబ్ పంత్. తొలుత కాల్ లిఫ్ట్ చేసిన మాహీ సతీమణి సాక్షి సింగ్, ఏదో వంట చేస్తున్నట్టు కనిపించింది.

Latest Videos

పక్కనే ఉన్న మామగారిని పరిచయం చేసి, మాహీ వైపు చూపించింది సాక్షి సింగ్. వెంటనే రిషబ్ పంత్.. ‘ధోనీని కొన్ని రోజులు బతకనివ్వండి... ’ అంటూ సాక్షితో సరదాగా అన్నాడు. దీంతో వెంటనే ధోనీ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేశాడు. దీంతో అందరూ నవ్వుకున్నారు..  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

7️⃣ seconds of pure joy! 💙

PS: That 🆒 cameo by MS Dhoni 😂 pic.twitter.com/HFGD8Yy9iC

— KolkataKnightRiders (@KKRiders)

టీమిండియాకి రెండు వరల్డ్ కప్స్, మూడు ఐసీసీ టైటిల్స్, ఐపీఎల్‌లో నాలుగు సార్లు సీఎస్‌కేని ఛాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ, ఇంట్లో ముందు పెళ్లాం చెప్పినట్టే వింటానని గర్వంగా ప్రకటించాడు. సాక్షి సింగ్ కూడా సోషల్ మీడియాలో మాహీపై తన డామినేషన్‌ని చాటుకుంటూ ఉంటుంది...

దీంతో పిచ్చి పిచ్చి వంటలు చేసి, మా మాహీ ప్రాణాలు తీయొద్దనే ఉద్దేశంతో రిషబ్ పంత్ అలా కామెంట్ చేయడం, ధోనీ వెంటనే ఫోన్ కట్ చేయడం జరిగిపోయాయి.

జూన్ 27 బుధవారం ఆఖరి వన్డే ఆడిన తర్వాత యజ్వేంద్ర చాహాల్, స్వదేశానికి తిరిగి రానున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్.  వన్డే సిరీస్‌కి దూరంగా ఉన్న రిషబ్ పంత్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.. టీ20 సిరీస్‌లో పాల్గొనబోతున్నారు...

ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా జూలై 29న తొలి టీ20 మ్యాచ్ ఆడే టీమిండియా- వెస్టిండీస్, ఆ తర్వాత ఆగస్టు 1న రెండో టీ20, 2న మూడో టీ20 మ్యాచులు ఆడతాయి. ఆ తర్వాత నాలుగు రోజుల గ్యాప్ తర్వాత ఆగస్టు 6న నాలుగో టీ20, 7న ఐదో టీ20 మ్యాచ్ ఆడే టీమిండియా... స్వదేశానికి తిరిగి రానుంది...
 

click me!