ధోని పుట్టినరోజు స్పెషల్...అరుదైన కానుకతో గౌరవించిన ఐసిసి (వీడియో)

Published : Jul 06, 2019, 05:18 PM IST
ధోని పుట్టినరోజు స్పెషల్...అరుదైన కానుకతో గౌరవించిన ఐసిసి (వీడియో)

సారాంశం

టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని పుట్టినరోజును పురస్కరించుకుని ఐసిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ధోని  గొప్పతనాన్ని తెలియజేస్తూ అద్భుతంగా రూపొందించిన ఆ వీడియయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

మహేంద్ర సింగ్ ధోని...భారత క్రికెట్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు. ఎందరో దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కాని అరుదైన విజయాలను టీమిండియా పగ్గాలు చేపట్టిన ఆరంభంలోనే సాధించిపెట్టాడు. ఐసిసి నిర్వహించే ప్రతిష్టాత్మకమైన వన్డే, టీ20  ప్రపంచ కప్ లనే కాదు మరెన్నో టోర్నీల్లో కలగా మిగిలిన గెలుపును సాకారం చేసి ప్రపంచ దేశాల  ముందు టీమిండియాను సగర్వంగా నిలబెట్టాడు. అలాంటి క్రికెట్ దిగ్గజం రేపటితో(ఆదివారం) 38వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. 

37ఏళ్ళ  ప్రాయం నుండి 38వ వసంతంలోకి అడుగుపెడుతున్న ధోనికి ఐసిసి(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ముందుగానే సర్‌ప్రైజ్ చేసింది. జూలై ఏడవ తేదీన ధోని పుట్టినరోజును పురస్కరించుకుని ఐసిసి ఓ వీడియయోను రూపొందిచింది. అతడి కెరీర్ కు సంబంధించిన పలు విశేషాలు, సాధించిన ఘనతలతో ధోని గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను అధికారిక ట్విట్టర్లో ఐసిసి పోస్ట్  చేసింది. 

''ఆ పేరు ఇండియన్ క్రికెట్ గతినే మార్చేసింది....ఆ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్లమందికి ఆదర్శంగా నిలిచింది... ఆ పేరు అపరిమితమైన గౌరవానికి ప్రతీక... ఎంఎస్ ధోని... కేవలం పేరు కాదది'' అంటూ ధోనిని ఐసిసి ఆకాశానికెత్తేసింది. 

 ఐసిసి తమకు ఇష్టమైన ఆటగాన్ని అద్భుతమై వీడియోతో గౌరవించడంతో ధోని అభిమానులు ఫిదా అవుతున్నారు. అసలే ధోని ఫీవర్...ఆపై పుట్టినరోజు...బోనస్ గా ఐసిసి ట్వీట్.  ఇలా ఎంఎస్ అభిమానులకు రేపు(ఆదివారం) మరో పండగరోజు కానుంది. ధోని  గొప్పతనాన్ని తెలియజేస్తూ అద్భుతంగా రూపొందించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !
Aman Rao: షమీ, ఆకాష్ దీప్‌లను ఉతికారేసిన తెలుగు కుర్రాడు.. 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ సెంచరీ