వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్ అయిన ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఘాటుగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఒక్క ప్రపంచకప్ గెలవనోళ్లు కూడా లెజెండరీ కెప్టెన్ కాంట్రాక్టు తొలగించడం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ రిటైర్మెంట్ తీసుకునే సమయం దగ్గరపడిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటీవల బీసీసీఐ వార్షిక ఒప్పంద జాబితాలో ధోనీకి చోటు దక్కని సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా సెహ్వాగ్ స్పందించాడు.
ధోనీ ఇక రిటైర్మెంట్ గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించాడు. ‘సెలెక్టర్లు ఇప్పటికే ధోనీని ఎంపిక చేయకూడదనే నిర్ణయానికి వచ్చేసుంటారు. దీంతో బీసీసీఐ కూడా ఓ నిర్ణయానికి వచ్చేసి అతనితో ఒప్పందం చేసుకోలేదు’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వార్షిక ఒప్పంద జాబితాలో లేకపోవడం అంటే.. ‘నీకు ఇష్టమైనప్పుడు ఆట నుంచి తప్పుకో’ అనే సందేశం ధోనీకి అందినట్లేనని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
undefined
Also Read ప్రపంచ కప్ టైటిల్ రవిశాస్త్రికి అబ్షెషన్: నేను డిక్షనరీలో లేదు..
ఇదిలా ఉండగా బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి చోటుదక్కకపోవడంపై అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్ అయిన ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఘాటుగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఒక్క ప్రపంచకప్ గెలవనోళ్లు కూడా లెజెండరీ కెప్టెన్ కాంట్రాక్టు తొలగించడం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సెహ్వాగ్ కూడా బీసీసీఐ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.