చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్.. స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుకు ఎస‌రు !

By Mahesh Rajamoni  |  First Published Feb 24, 2024, 2:18 PM IST

Yashasvi Jaiswal: భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఇదే క్ర‌మంలో టెస్టు క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సచిన్ టెండూల్కర్, క‌పిల్ దేవ్ వంటి దిగ్గజాలను అధిగ‌మించాడు.


IND vs ENG - Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఉతికిపారేస్తున్నారు. వ‌రుస గా ఇప్ప‌టికే రెండు డ‌బుల్ సెంచ‌రీలు  బాద‌న య‌శ‌స్వి జైస్వాల్ రాంచీలో జ‌రుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రి కొట్టాడు. ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని టెస్టు క్రికెట్ రికార్డులు న‌మోదుచేస్తూ.. దిగ్గ‌జ ప్లేయ‌ర్ల స‌ర‌న‌స చేరాడు.

టెస్టు క్రికెట్‌లో జైస్వాల్  సిరికొత్త‌ చరిత్ర

Latest Videos

రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్ భారత క్రికెట్‌లో మ‌రో భారీ రికార్డు సాధించాడు. జైస్వాల్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 23 సిక్సర్లు కొట్టాడు. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో ఆస్ట్రేలియాపై 25 సిక్సర్లు బాదాడు.

ఒక జట్టుపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు 

25 సిక్సర్లు - సచిన్ టెండూల్కర్ - vs ఆస్ట్రేలియా
23 సిక్సర్లు - యశస్వి జైస్వాల్ - vs ఇంగ్లాండ్
22 సిక్సర్లు - రోహిత్ శర్మ - vs సౌతాఫ్రికా
21 సిక్సర్లు - కపిల్ దేవ్ - vs ఇంగ్లాండ్
21 సిక్సర్లు - రిషబ్ పంత్ - vs ఇంగ్లాండ్

ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెట‌ర్ 

భార‌త్-ఇంగ్లాండ్ లో సిరీస్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. ఈ సిరీస్‌లో 20కి పైగా సిక్సర్లు కొట్టాడు. క్రికెట్ చరిత్రలో టెస్టు సిరీస్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్. ఈ రికార్డులో రోహిత్ శర్మను అధిగ‌మించాడు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ 19 సిక్సర్లు బాదాడు.

టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట‌ర్లు 

23 సిక్సర్లు - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లాండ్ (2024)*
19 సిక్సర్లు - రోహిత్ శర్మ vs సౌతాఫ్రికా (2019)
15 సిక్సర్లు - షిమ్రెన్ హెమిమిర్ vs బంగ్లాదేశ్ (2018)
15 సిక్సర్లు - బెన్ స్టోక్స్ vs ఆస్ట్రేలియా (2023)

click me!