India vs England: రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో 2 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే గ్రౌండ్ లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
India vs England : రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో 353 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. జోరూట్ 122 పరుగులతో సెంచరీ కొట్టగా, రవీంద్ర జడేజా 4 వికెట్లు, ఆకాశ్ దీప్ 3, మహ్మద్ సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. మరోసారి ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్.. హిట్ మ్యాన్ ను పెవిలియన్ కు పంపాడు. అండర్సన్ బౌలింగ్ లో ఫోక్స్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
అయితే, రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత గ్రౌండ్ ను వీడుతూ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్లాడు. అయితే, హిట్ మ్యాన్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న సమయంలో స్టేడియంలోని ఇంగ్లాండ్ మద్దతుదారులు రోహిత్ శర్మను ఎగతాళి చేశారు. రోహిత్ శర్మ వైపూ చూపిస్తూ చేతులు ఊపుతూ ఏకంగా 'బై బై రోహిత్' అంటూ పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
undefined
After was dismissed by and as he was walking back to the dressing room, supporters inside the stadium waved their hands and sang 'Bye Bye Rohit' in unison. pic.twitter.com/wnHA7KKSlV
— mahe (@mahe950)భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు రెండో రోజు లంచ్ సమయానికి భారత్ 34/1 పరుగులతో ఆటనుకొనసాగించింది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ లు క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల వద్ద తొలి రోజును ముగించిన ఇంగ్లాండ్ రెండో రోజు 353 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్, ఆలీ రాబిన్సన్ ఎనిమిదో వికెట్‌కు తమ భాగస్వామ్యాన్ని మరింత పొడిగించారు. ఓలీ రాబిన్సన్ 96 బంతుల్లో 58 పరుగులు చేసి తన మొదటి టెస్ట్ ఫిఫ్టీని సాధించాడు.
డేవిడ్ వార్నర్ కు గాయం..ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ ఆడతాడా? లేదా?