వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాప్! పాకిస్తాన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న మోర్నే మోర్కెల్...

By Chinthakindhi Ramu  |  First Published Nov 14, 2023, 12:49 PM IST

వరల్డ్ కప్‌లో 4 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన పాకిస్తాన్... పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ పదవికి మోర్నే మోర్కెల్ రాజీనామా.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. శ్రీలంక, నెదర్లాండ్స్‌పై గెలిచి, ఆరంభంలో టేబుల్ టాపర్‌‌‌గా ఉన్న పాకిస్తాన్, భారత్ చేతుల్లో ఓడిన తర్వాత కోలుకోలేకపోయింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. వర్షం కరుణించడంతో న్యూజిలాండ్‌పై లక్కీగా గెలిచిన పాకిస్తాన్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడింది...

మొత్తంగా 4 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది పాకిస్తాన్. ఈ పర్ఫామెన్స్‌తో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, తన బాధ్యతల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు.  ఈ ఏడాది జూన్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌తో ఉంటున్నాడు మోర్నీ మోర్కెల్.

Latest Videos

undefined

షాహీన్ షా ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్ వంటి ఫాస్ట్ బౌలర్లతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది పాకిస్తాన్. అయితే పాక్ బౌలర్లు, బ్యాటర్లు అందరూ మూకుమ్మడిగా ప్రపంచ కప్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. షాహీన్ ఆఫ్రిదీ 18 వికెట్లు, హారీస్ రౌఫ్ 16 వికెట్లు తీసినా ఆఫ్ఘాన్, శ్రీలంక వంటి టీమ్స్‌పైన కూడా భారీగా పరుగులు సమర్పించారు.

మోర్నే మోర్కెల్ రాజీనామాతో ఆ పొజిషన్‌ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్‌తో రిప్లేస్ చేయాలని చూస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కోచింగ్ స్టాఫ్ మొత్తంపై వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది..

పాకిస్తాన్ హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్‌లను సేవల నుంచి తప్పించాలని పీసీబీ ఆలోచిస్తున్నట్టు, త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. 

click me!