Mohammed Shami: షాకింగ్.. ప్రపంచకప్‌లో షమీ ప్రతిరోజు ఇంజెక్షన్స్ తీసుకున్నాడట..!

By Rajesh Karampoori  |  First Published Dec 31, 2023, 3:17 AM IST

Mohammed Shami: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు, శ్రీలంకపై ఐదు, దక్షిణాఫ్రికాపై రెండు వికెట్లు మహ్మద్ షమీ పడగొట్టాడు. ఇక సెమీ ఫైనల్‌లో అయితే.. న్యూజిలాండ్‌పై విధ్వంసం సృష్టించి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇలా ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు. అద్భుతంగా ప్రపంచ కప్ లో రాణించిన షమీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన సుధీర్ఘకాలంగా చీలమండ గాయంతో బాధపడుతున్నాడనీ, ఆ నొప్పిని తట్టుకుంటూ.. వన్డే ప్రపంచకప్ లో రాణించారని తెలుస్తోంది. 


Mohammed Shami: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ఏవిధంగా రాణించారో అందరికీ తెలిసిందే. మహ్మద్ షమీ తొలి నాలుగు మ్యాచులు ఆడకపోయినా.. హార్దిక్ పాండ్య దూరం కావడంతో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ నుంచి షమీకి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం వచ్చింది. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా అదరగొట్టాడు. తన బౌలింగ్ తో ప్రత్యార్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 మ్యాచ్‌లలోనే 24 వికెట్లను పడగొట్టాడు. ఇందులో రెండు మ్యాచ్‌లలో అయితే.. 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. 

అయితే.. ఈ ప్రపంచ కప్ వీరుడు  షమీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అతడు సుధీర్ఘకాలం చీలమండ గాయంతో బాధపడుతున్న వన్డే ప్రపంచకప్ సమయంలోనూ ఆ తీవ్రమైన నొప్పిని తట్టుకుంటూ.. రోజు ఇంజెక్షన్స్ తీసుకుంటూ.. బరిలోకి దిగాడని  బెంగాల్ జట్టులోని షమీ మాజీ సహచరుడు వెల్లడించాడు. ఇలా ప్రపంచ కప్ టోర్నీ మొత్తం షమీ గాయంతో బాధపడ్డాడనీ, అయినా.. ఆ నొప్పిని భరించాడని.. ప్రతిరోజూ ఇంజెక్షన్స్ తీసుకున్నాడని, వయసు పెరుగుతున్నా కొద్దీ గాయాలు నయం కావాలంటే సమయం పడుతుందని అతడు పేర్కొన్నాడు.

Latest Videos

షమీ ఆటతీరు అద్భుతం

హార్దిక్ పాండ్యా గాయం తర్వాత షమీకి ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభించింది. ధర్మశాలలో న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ ఆడి ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత షమీ ఇంగ్లండ్‌పై నాలుగు, శ్రీలంకపై ఐదు, దక్షిణాఫ్రికాపై రెండు వికెట్లు పడగొట్టాడు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విధ్వంసం సృష్టించి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌లో అతను ఆస్ట్రేలియాపై ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఈ విధంగా షమీ ప్రపంచకప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు.

షమీని మిస్సవుతున్న టీమిండియా

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు. భారత్‌ మహ్మద్‌ షమీని మిస్‌ చేసుకుంది' అని ఆయన అన్నారు. ప్రస్తుత సిరీస్‌లో భారత బౌలర్లు అక్కడి పరిస్థితులను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నారు. వారు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుందని మంజ్రేకర్ అన్నారు.

స్కోరుబోర్డుపై మరికొంత పరుగులు రాబట్టడం మినహా ప్రధాన విషయం ఏమిటంటే మీరు విభిన్నంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. షమీ గురించి మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో అతని రికార్డు అద్భుతమైనది. అతను ఎనిమిది మ్యాచ్‌లలో 3.12 ఎకానమీ రేటుతో 35 వికెట్లు తీశాడు. రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. రెండేళ్ల క్రితం.. మూడు టెస్టుల సిరీస్ కోసం భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు.. షమీ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచారని పేర్కొన్నారు. 

click me!