సారీ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. నో చెప్పిన సునీల్ గవాస్కర్ ! ఎం జ‌రిగింది?

By Mahesh Rajamoni  |  First Published Dec 30, 2023, 5:43 PM IST

Irfan Pathan-Sunil Gavaskar: సౌతాఫ్రికాతో జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఆటతీరు, టెక్నిక్స్, బ్యాటింగ్ శైలిని విశ్లేషించిన ఇర్ఫాన్ ప‌ఠాన్ గొప్ప ఇన్నింగ్స్ అంటూ కొనియాడాడు. ఈ ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌లో ప‌ఠాన్ సారీ చెప్ప‌గా.. క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ ఈ క్ష‌మాప‌ణ‌ల‌ను అంగీక‌రించ‌లేదు.. ఏం జ‌రిగిందంటే...
 


Why Gavaskar refused to accept Pathan's apology: సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 101 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడంటూ ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, రాహుల్ ఇన్నింగ్స్ ను విశ్లేషణ సంద‌ర్భంగా భార‌త మాజీ ఆల్ రౌండ‌ర్, స్టార్ ప్లేయ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ సారీ చెప్ప‌గా.. అక్క‌డే ఉన్న దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ ఆ క్ష‌మాప‌ణ‌లు అంగీక‌రించ‌డానికి నిరాక‌రించాడు. ఏం జ‌రిగింది అనుకుంటున్నారా?

కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ విశ్లేష‌ణ క్ర‌మంలో భారత మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ పఠాన్  అతని టెక్నిక్, బ్యాటింగ్ శైలిపై ప్రశంసలు కురిపించాడు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ఠాన్ తో పాటు గ‌వాస్క‌ర్ కూడా ఉన్నారు. అయితే, తన విశ్లేషణ ఎక్కువవుతోందని గ్రహించిన పఠాన్.. మాట్లాడుతున్న క్ర‌మంలో  లివింగ్ లెజెండ్ గవాస్కర్ కు 'సర్ సారీ' అంటూ క్షమాపణలు చెప్పి త‌న విశ్లేష‌ణ‌ను కొన‌సాగించాడు. అయితే ఈ క్షమాపణను తాను అంగీకరించబోనని సునీల్ గ‌వాస్క‌ర్ చెప్పాడు. రాహుల్ టెక్నిక్ పై ఇర్ఫాన్ అద్భుతమైన విశ్లేషణ ఇస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. తాను కూడా కొత్త అంశాల‌ను పొందాననీ, పఠాన్ ఆటకు నిజమైన విద్యార్థి అని గవాస్కర్ ప్రశంసించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్  మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Latest Videos

 

Gratitude fills me today, and it's not just any day—thanks to Sunny sir for the uplifting compliment. Truly made my year. pic.twitter.com/0jk4uqOczR

— Irfan Pathan (@IrfanPathan)

కాగా, సెంచూరియన్ వేదికగా జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టు  మూడు రోజుల్లో ముగిసింది. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో 34.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేసింది. దీంతో రెండు మ్యాచ్ ల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలవగా, 31 ఏళ్ల తర్వాత తొలిసారి రెయిన్ బో నేషన్ లో టెస్టు సిరీస్ నెగ్గాలన్న భారత్ కలలు అడియాశలయ్యాయి.

IND VS SA: రెండో టెస్టులో గెలవాలంటే టీమిండియాలో ఆ మార్పులు చేయాల్సిందే.. సునీల్ గవాస్కర్

click me!