Mohammed Shami: ఏంది సామీ నువ్వు

By Venugopal Bollampalli  |  First Published Nov 16, 2023, 12:34 AM IST

ఒకవేళ భారత్ ఏ కారణంగా అయినా ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే.. మళ్లీ రెండేళ్ల కిందటిలాగానే షమీని దారుణంగా తిట్టుకొని ఉండేవాళ్లేమో.   మ్యాచ్ కీలక సమయంలో న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని నేలపాలు చేయడం అతని కెరియర్ లోనే అతి పెద్ద తప్పిదం అయ్యేదేమో.


సరిగ్గా రెండేళ్ల కిందట.. టీ20 ప్రపంచ కఫ్‌లో భారత్, పాకిస్థాన్ ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్. అప్పటి వరకు ప్రపంచ కప్ లో పాక్ పై ఓటమి ఎరుగని భారత్ ఈ టీ 20 మ్యాచ్ లో పాక్ చేతిలో చిత్తులా ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ అలా పూర్తయిందో లేదో.. చాలా మంది భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా మొత్తం షమీపై తిట్ల దండకం అందుకున్నారు. 3.5 ఓవర్లు వేసిన షమీ ఆ మ్యాచ్ లో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

అప్పుడు ఆ మ్యాచ్ ఓటమికి షమీనే కారణమంటూ అతనిపై ట్రోలింగ్ అలా ఇలా జరగలేదు. అత్యంత దారుణంగా షమీపై ట్రోలింగ్ జరిగింది. షమీ ఏమాత్రం క్వాలిటీ బౌలర్ కాదని.. వేస్ట్ అని.. ఇంకా .. ఇంకా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్ చేశారు. చివరకు సెహ్వాగ్, సచిన్ షమీకి మద్ధతుగా నిలిచారు.

Latest Videos

undefined

మరి నేడు.. షమీ సుల్తాన్ ఆఫ్ సీమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా షమీ పేరు మారుమోగిపోతోంది. సరిగ్గా రెండేళ్లలో తాను ప్రపంచంలోనే అత్యద్భుత బౌలర్ గా మారిపోయాడు. రోహిత్ కి ఎప్పుడు వికెట్ కావాలంటే.. అప్పుడు ఆదుకొనే ఏకైక బౌలర్ గా మారిపోయాడు.

ప్రపంచకప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు చాలా మంది మదిలో తొలిచే ప్రశ్న ఒకటే.. న్యూజిలాండ్ మ్యాచ్ లో షమీ ఏడు వికెట్లు తీయకుంటే.. దాదాపు 400 టార్గెట్ నిలబడేదా? కచ్చితంగా నిలబడేది కాదు. భారత అభిమానుల గుండేల్లో మరో న్యూజిలాండ్ ఊచకోత కనిపించేది.

వ్యక్తిగతంగా తన జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా.. ఓ క్రికెటర్ గా మాత్రం గత రెండేళ్లలో షమీ ఎదిగిన తీరు అత్యద్భుతం. వాస్తవానికి షమీ తాజాగా అద్భుతాలు రాత్రికి రాత్రి జరిగిపోలేదు. దాదాపు రెండేళ్ల కఠోర శ్రమ ఉంది. మా కఠోర శ్రమ, లయ(రిథమ్) వల్ల మీరు బౌలింగ్ లో తుఫాన్‌.‌ను చూస్తున్నారు. భారత బౌలింగ్‌ ను ఆస్వాదించని వారే ఉండరనిపిస్తోంది. మేం యూనిట్‌గా కలిసి పనిచేస్తున్నాం, దాని ఫలితాలను మీరు చూడగలుగుతున్నారు" అని షమీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ శ్రమను వివరించాడు.

మొహమ్మద్ షమీ  బౌలింగ్ సీక్రెట్

సరైన చోట బంతిని వేయడం

లయ ఉండేలా చూసుకోవడం

బేసిక్స్ కి స్టికాన్ కావడం

మంచి లైన్ అండ్ లెంగ్త్

చివరగా...

ఒకవేళ భారత్ ఏ కారణంగా అయినా ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే.. మళ్లీ రెండేళ్ల కిందటిలాగానే షమీని దారుణంగా తిట్టుకొని ఉండేవాళ్లేమో.   మ్యాచ్ కీలక సమయంలో న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని నేలపాలు చేయడం అతని కెరియర్ లోనే అతి పెద్ద తప్పిదం అయ్యేదేమో. తాను నేలపాలు చేసిన వికెట్ ని తానే తీసి.. తనలో ఉన్న కసిని మరోసారి నిరూపించుకున్నాడు, లేకుంటే గత వన్డే ప్రపంచ కఫ్ లో ధోనీ రనవుట్ లాగా షమీ వదిలిన క్యాచ్ అత్యంత చేదు గుర్తుగా మిగిలిపోయేది.

ఇక ఫైనల్లోనూ షమీ గనుక తన ఫామ్ ను కొనసాగిస్తే.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిపోతాడు. మొదటి నాలుగు మ్యాచ్‌లు ఆడకపోవడం.. హార్ధిక్ కు గాయం అవడంతో జట్టులోకి వచ్చిన షమీ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని.. ప్రత్యర్థులకు ఆడరాని బౌలర్ గా మారిపోయాడు.

 

click me!