స్వదేశంలో మొదటి బంతికే వికెట్ తీసిన సిరాజ్... కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రిషబ్ పంత్...

Published : Feb 14, 2021, 01:39 PM IST
స్వదేశంలో మొదటి బంతికే వికెట్ తీసిన సిరాజ్... కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రిషబ్ పంత్...

సారాంశం

87 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... స్వదేశంలో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన మహ్మద్ సిరాజ్... అద్భుతమైన క్యాచ్ అందుకున్న రిషబ్ పంత్...  

ఆస్ట్రేలియా టూర్‌లో 13 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్... స్వదేశంలో వేసిన మొదటి బంతికే వికెట్ తీశాడు. 22 పరుగులు చేసిన ఓల్లీ పోప్‌ను అద్భుతమైన బంతికే అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఓల్లీ పోప్‌ను పెవిలియన్ చేర్చారు.

ఫలితంగా 87 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును ఓల్లీ పోప్, బెన్ ఫోక్స్ కలిసి ఆరో వికెట్‌కి 35 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు.

 

ఈ జోడిని విడగొట్టేందుకు 15 ఓవర్ల పాటు వివిధ బౌలర్లను మార్చి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ సమయంలో బంతి అందుకున్న సిరాజ్... మొదటి బంతికే వికెట్ తీశాడు. వికెట్ల వెనకాల గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు రిషబ్ పంత్. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !