Tania Singh suicide Case: మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నస్టార్ ప్లేయర్ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ను హైదరాబాద్ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది.
Model Tania Singh suicide Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న మర్ ప్లేయర్ వివాదాల్లో చిక్కుకున్నాడు. మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు అభిషేక్ శర్మ ను పోలీసులు విచారించారు. ఆత్మహత్య తర్వాత అతనికి సమన్లు పంపారు. ఆ తర్వాత విచారణ జరిపారు. ఆత్మహత్యలో అతని ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణను జరుపుతున్నారు.
సూరత్‌లోని వెసు రోడ్డులోని 'హ్యాపీ ఎలిగాన్స్ అపార్ట్‌మెంట్'లో నివసించే 28 ఏళ్ల మోడల్ తానియా సింగ్ మృతిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తాయి. ఈ ఫేమస్ మోడల్ గత ఏడాదిన్నరగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చేస్తోంది. అయితే ఆమె ఫిబ్రవరి 20న ఆమె ఆత్మహత్య చేసుకుంది. తానియా మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తమ విచారణ ప్రారంభించగా, ఆమె కాల్ డేటాను పరిశీలించారు. కాల్ లిస్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న క్రికెటర్ అభిషేక్ శర్మ కూడా ఉన్నారు.
మోడల్ తానియా చివరిసారిగా 23 ఏళ్ల అభిషేక్‌కి కాల్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. తానియా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగంలో పనిచేసేది. సోషల్ మీడియాలో తానియాకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డిస్క్ జాకీ, మేకప్ ఆర్టిస్ట్, మోడల్ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో పేర్కొంది. అభిషేక్‌కి తానియా సింగ్‌తో పరిచయం ఉన్నట్లు విచారణలో తేలింది.
తానియా చివరి కాల్ అభిషేక్ శర్మకు..
ఈ కేసులో తానియా కాల్ వివరాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆమె చివరి కాల్ కూడా అభిషేక్ శర్మకు చేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరీ అభిషేక్ శర్మ..?
అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టీమ్ లో ఉన్నాడు. అతను ఆల్ రౌండర్. ఐపీఎల్‌లో 47 మ్యాచ్‌లు ఆడి 137.38 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 75 పరుగులు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 4 అర్ధ సెంచరీలు, 9 వికెట్లు తీశాడు. 2022 ఐపీఎల్ వేలంలో అభిషేక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది.