గ‌వాస్క‌ర్, కోహ్లీ రికార్డుల‌పై క‌న్నేసిన య‌శ‌స్వి జైస్వాల్.. అలా జ‌రిగితే స‌రికొత్త చ‌రిత్రే.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 21, 2024, 5:08 PM IST

Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో య‌శస్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డులు మోత మోగిస్తున్నాడు. ఇప్పుడు భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సునీల్ గ‌వాస్క‌ర్, విరాట్ కోహ్లీ రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డం పై క‌న్నేశాడు.  
 


Yashasvi Jaiswal Records: టీమిండియా యంగ్ ప్లేయ‌ర్, ఓపెన‌ర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతున్నాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టెస్టు క్రికెట్ లో స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 545 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 500+ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కొన‌సాగుతున్నాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు భార‌త్-ఇంగ్లాండ్ లు ఆడ‌నున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో 4వ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, 5వ‌ మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.

భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న య‌శ‌స్వి జైస్వాల్ ప్రస్తుతం భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సునీల్ గ‌వాస్క‌ర్, విరాట్ కోహ్లీ రికార్డుల‌పై క‌న్నేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా మాజీ లెజెండరీ టెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బద్దలు కొట్టే అవకాశం యశ‌స్వి జైస్వాల్ కు ఉంది.

Latest Videos

undefined

విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెట‌ర్లు

సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్ (1971) - 774 పరుగులు
సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్ (1978-79) - 732 పరుగులు
విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా (2014-15) - 692 పరుగులు
విరాట్ కోహ్లీ vs ఇంగ్లాండ్ (2016) - 655 పరుగులు
దిలీప్ సర్దేశాయ్ vs వెస్టిండీస్ (1971) - 642 పరుగులు

ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ కూడా గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. అయితే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల సిరీస్‌లో కోహ్లీ 692 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో 148 పరుగులు చేస్తే  జైస్వాల్.. టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీని అధిగమిస్తాడు. 230 ప‌రుగులు చేస్తే విరాట్ తో పాటు సునీల్ గ‌వాస్క‌ర్ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. ప్ర‌స్తుతం య‌శ‌స్వి జైస్వాల్ ఫామ్ చూస్తే దిగ్గ‌జ ప్లేయ‌ర్ల రికార్డులు బ్రేక్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.. !

వ‌రుస సెంచ‌రీల మోత‌.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ దూకుడు.. !

click me!