MIvsRR: ముంబై ‘హ్యాట్రిక్’ విక్టరీ... హ్యాట్రిక్ కొట్టిన రాజస్థాన్...

By team teluguFirst Published Oct 6, 2020, 11:16 PM IST
Highlights

70 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన బట్లర్... మూడు వికెట్లు తీసిన బుమ్రా...

హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్...

వరుసగా మూడో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్...

IPL 2020 సీజన్ 13లో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టి, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది. 194 పరుగుల భారీ లక్ష్యచేధనలో 136  పరుగులకే పరిమితమైంది రాజస్థాన్ రాయల్స్. రెండో మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్... తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ కాగా, మొదటి రెండు మ్యాచుల్లో అదరగొట్టిన సంజూ శాంసన్ కూడా డకౌట్ అయ్యాడు.

కెప్టెన్ స్టీవ్ స్మిత్ 6 పరుగులు చేయగా, మహిపాల్ లోమ్రోర్ 11, టామ్ కుర్రాన్ 15, రాహుల్ తెవాటియా 5 పరుగులు చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేసిన జోస్ బట్లర్ కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. బట్లర్‌ ఉన్నంతసేపు పోరాడిన రాజస్థాన్, అతను అవుట్ కావడంతో మ్యాచ్‌పై పూర్తిగా పట్టుకోల్పోయింది. 

జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్ 2, రాహుల్ చాహార్, ప్యాటిన్సన్, పోలార్డ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. 57 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది.

click me!