OMG ఇదేం బాల్ భయ్యా... చంపేస్తావా! పాండ్యాకు షాక్ ఇచ్చిన ఆర్చర్...

Published : Oct 06, 2020, 10:26 PM IST
OMG ఇదేం బాల్ భయ్యా... చంపేస్తావా! పాండ్యాకు షాక్ ఇచ్చిన ఆర్చర్...

సారాంశం

ఆర్చర్ వేసిన భీమర్‌కు షాకైన హార్ధిక్ పాండ్యా... బంతిని అందుకోలేక కింద పడిపోయిన వికెట్ కీపర్ బట్లర్...

IPL 2020: నిప్పులు చెరిగే బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతుంటారు పేసర్లు. బుమ్రా, బౌల్ట్, రబాడ వంటి స్టార్ పేసర్లు విసిరే బాల్ తగిలితే... ఆ నొప్పి మామూలుగా ఉండదు. వీరి కంటే మరో రేంజ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బీమర్‌తో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను భయపెట్టాడు ఆర్చర్. 

19వ ఓవర్ మొదటి బంతికి ఆర్చర్ వేసిన భీమర్‌కు షాకైన హార్ధిక్ పాండ్యా... కింద పడిపోయాడు. 154 కి.మీల మెరుపు వేగంతో నేరుగా దూసుకొచ్చిన ఫుల్ టాస్ బంతి చూసి కీపర్ బట్లర్ చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.

 

 

అంపైర్ నో బాల్‌గా ప్రకటించగా... ఆర్చర్ ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా తర్వాతి బంతి వేయడానికి వెళ్లిపోయాడు. పాండ్యా, బట్లర్ మాత్రం షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు. ‘ఇదేం బాల్ భయ్యా... చంపేస్తావా’ అనే లుక్‌తో ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !