MI vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2.. ముంబై vs పంజాబ్ ఫాంటసీ టీమ్ ఇదే

Published : Jun 01, 2025, 06:02 PM IST
PBKS vs MI Qualifier 2

సారాంశం

MI vs PBKS Fantasy XI: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ (MI) vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో ఆర్సీబీతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కు సంబంధించి ఫాంటసీ జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ బిగ్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడుతుంది.

MI vs PBKS Qualifier 2: ఫాంటసీ జట్టు

ఫాంటసీ వికెట్ కీపర్లు:

జానీ బెయిర్‌స్టో: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ అయిన జానీ బెయిర్‌స్టో ప్రస్తుతం ముంబై జట్టులో చేరాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తన జాతీయ జట్టు తరఫున ఆడేందుకు వెళ్లడంతో అతని స్థానంలో జానీ బెయిర్ స్టో ముంబై జట్టులో చేరాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మొత్తంగా 51 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1636 పరుగులతో ఒక సెంచరీ కూడా సాధించాడు.

ప్రభ్ సిమ్రన్ సింగ్: ఈ సీజన్‌లో ఇప్పటికే 15 మ్యాచ్‌ల్లో 517 పరుగులు చేశారు. 4 అర్ధశతకాలు, 166 స్ట్రైక్‌రేట్‌తో దుమ్మురేపే బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.

ఫాంటసీ బ్యాట్స్‌మెన్లు:

సూర్యకుమార్ యాదవ్: 15 మ్యాచ్‌ల్లో 673 పరుగులతో ఐపీఎల్ 2025లో సెకండ్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. 

రోహిత్ శర్మ: ఈ లెజెండరీ ప్లేయర్ ఈ సీజన్‌లో 410 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరు 81 పరుగులు.

ప్రియాంష్ ఆర్య: ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున సెంచరీ కొట్టిన ఓపెనర్. మొత్తం 431 పరుగులు చేశారు.

ఫాంటసీ ఆల్‌రౌండర్లు:

హార్దిక్ పాండ్యా: ముంబయి కెప్టెన్ హార్దిక్ ఇప్పటివరకు 209 పరుగులు, 13 వికెట్లు తీశాడు.

మిచెల్ సాంట్నర్: కీలక సమయాల్లో 10 వికెట్లు తీసిన సాంట్నర్‌ను జట్టులో కలుపుకోవచ్చు.

మార్కస్ స్టోయినిస్: 11 మ్యాచ్‌ల్లో 152 పరుగులు చేసి డెత్ ఓవర్లలో సత్తా చాటాడు.

ఫాంటసీ బౌలర్లు:

జస్ప్రిత్ బుమ్రా: 11 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. బెస్ట్: 4/22 వికెట్లు.

ట్రెంట్ బౌల్ట్: ముంబయి తరఫున ఈ సీజన్ లో 21 వికెట్లు తీసిన బౌల్ట్.. 4/26 వికెట్లతో బెస్ట్ ప్రదర్శన ఇచ్చాడు.

అర్షదీప్ సింగ్: పంజాబ్ తరఫున 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి ఆ జట్టు తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు.

ఫాంటసీ కెప్టెన్ ఎంపికలు:

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా, ప్రభ్ సిమ్రన్ సింగ్ ను వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేసుకోవచ్చు. రిస్క్ టేకర్స్ కోసం ముంబయి ప్లేయర్ తిలక్ వర్మ, పంజాబ్ వైస్ కెప్టెన్ శశాంక్ సింగ్ ను పరిగణలోకి తీసుకోవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !