MIvsKXIP: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... పంజాబ్‌కి చావోరేవో...

Published : Oct 18, 2020, 09:13 PM IST
MIvsKXIP: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... పంజాబ్‌కి చావోరేవో...

సారాంశం

డి కాక్ మరో హాఫ్ సెంచరీ... 34 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా...  రెండు వికెట్లు తీసిన షమీ...   

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 9 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 7, హార్ధిక్ పాండ్యా 8 పరుగులకి అవుట్ కాగా క్వింటర్ డి కాక్ మరో హాఫ్ సెంచరీ బాదాడు.

కృనాల్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 34 పరుగులు చేయగా, 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు క్వింటన్ డి కాక్. 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఓ దశలో 150 స్కోరైనా చేస్తుందా అనిపించింది. అయితే పోలార్డ్, కల్టర్ నైల్ మెరుపులతో భారీ స్కోరు చేయగలిగింది ముంబై ఇండియన్స్. 

పోలార్డ్ 12 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు చేయగా,  కల్టర్ నైల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, ఆర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా రవి బిష్ణోయ్, జోర్డాన్ చెరో వికెట్ తీశారు.

PREV
click me!

Recommended Stories

Abhishek : నెంబర్ వన్ ర్యాంక్.. సున్నా పర్ఫార్మెన్స్ ! అభిషేక్ శర్మకు ఏమైంది?
IND vs ENG : సెమీఫైనల్‌లో భారత్‌కు సూర్యగ్రహణం? ఫామ్ లేక కెప్టెన్ ఇబ్బందులు !