SRH vs KKR: కోల్‌కత్తా ‘సూపర్’ విక్టరీ... ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి...

By team teluguFirst Published Oct 18, 2020, 7:35 PM IST
Highlights

36 పరుగులు చేసిన బెయిర్ స్టో... 29 పరుగులు చేసిన కేన్ విలియంసన్...

అబ్దుల్ సమద్ మెరుపులు...కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్... స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కి మ్యాచ్... 

సూపర్ ఓవర్‌లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓడిన సన్‌రైజర్స్...

IPL 2020: ఐపీఎల్‌లో మరో మ్యాచ్ ఉత్కం‘టై’గా ముగిసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి స్కోర్లు టైగా ముగిడయంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌కి 3 పరుగుల టార్గెట్ ఇచ్చింది. నాలుగు బంతుల్లో 3 పరుగులు చేసి ఈజీ విక్టరీ సాధించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 

టాస్ గెలిచి, ప్రత్యర్థికి ఫీల్డింగ్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి షాక్ ఇచ్చారు సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరంభంలో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మొదటి వికెట్‌కి 57 పరుగులు జోడించారు.

అయితే సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న లూకీ ఫర్గూసన్ మ్యాజిక్‌ స్పెల్‌తో సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. మొదటి బంతికి 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ను ఫర్గూసన్ అవుట్ చేశాడు. 28 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసి జానీ బెయిర్ స్టో అవుట్ కాగా, ప్రియమ్ గార్గ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు.

మనీశ్ పాండే 6 పరుగులు, విజయ్ శంకర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ 19వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు కావాల్సిన దశలో డేవిడ్ వార్నర్ 3 బౌండరీలతో 17 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 33 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్.

click me!