IPL 2020: ఎవరీ జుంపాల అంపైర్... స్టైలిష్ లుక్‌తో క్రేజ్ తెచ్చుకున్న పశ్చిమ్ పతక్...

Published : Oct 18, 2020, 08:52 PM IST
IPL 2020: ఎవరీ జుంపాల అంపైర్... స్టైలిష్ లుక్‌తో క్రేజ్ తెచ్చుకున్న పశ్చిమ్ పతక్...

సారాంశం

చూడడానికి అచ్చు మహిళలా కనిపించిన పశ్చిమ్ పతక్... దేశవాళీ మ్యాచ్‌లకు హెల్మెట్‌తో హాజరయ్యే భారత అంపైర్...

IPL 2020 సీజన్‌లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ధోనీ కోపంగా చూడడంతో అంపైర్ నిర్ణయాన్ని మార్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తొలిసారిగా ఓ అంపైర్ తన స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో పొడవాటి జుంపాల జట్టుతో వచ్చిన అంపైర్ పశ్చిమ్ పతక్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది.

చూడడానికి అచ్చు మహిళలా కనిపించిన పశ్చిమ్ లుక్‌ చూసి కొందరు క్రికెటర్లు కూడా వింతగా చూడడం టీవీల్లో కనిపించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగి ‘టై’గా ముగిసినా అంపైర్ పశ్చిమ్ లుక్‌పైనే ఎక్కువగా జోక్స్, మీమ్స్ పేలుతున్నాయి. కొందరు పశ్చిమ్‌ను పీటీ టీచర్ అని కామెంట్ చేస్తుంటే... మరికొందరు పశ్చిమ్ హెయిర్ స్టైయిల్‌పై ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే నిజానికి కొన్నాళ్ల కిందట పశ్చిమ్ ఇలా ఉండేవాడు కాదు. చాలా సింపుల్ లుక్‌తో అంపైరింగ్ చేసేవాడు. దేశీవాళీ మ్యాచులకు హెల్మెట్‌తో హాజరయ్యే అంపైర్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు పశ్చిమ్ పతక్. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది