ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి కావాలి...మనకు కావాల్సిందిదే: ముంబై కోచ్ జయవర్ధనే (వీడియో)

By Arun Kumar PFirst Published May 14, 2019, 3:22 PM IST
Highlights

హాట్ హాట్ సమ్మర్ లో క్రికెట్ ప్రియులకు ఐపిఎల్ 2019 మంచి మజాను పంచింది. రెండు నెలల పాటు సాగిన ఈ మెగా లీగ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలించింది. ఈ విజయంతో రోహిత్ సేన ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోపి వచ్చి చేరింది. అయితే ఈ సీజన్లో ముంబై జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగతంగా రికార్డులు సాధించకున్నా సమిష్టిగా రాణించి  విజయకేతనం ఎగురవేశారు. ఇదే సమిష్టితత్వం తమ జట్టును టైటిల్ విజేతగా నిలలబెట్టిందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన  ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఇలా ఐపిఎల్ 12 ట్రోఫీని  అందుకున్న ముంబై ఆటగాళ్లు మైదానంలోనే సంబరాలు చేసుకున్పారు. అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యులను ఉద్దేశిస్తూ కోచ్ జయవర్దనే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్ల ప్రదర్శనపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

''ముంబై  ఇండియన్స్ జట్టులో వ్యక్తిగతంగా ఎవరూ గొప్ప రికార్డులేమీ సాధించలేరు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సాధించిన ఆటగాళ్లు  మన జట్టులో లేరు. అయినా అవన్నీ మనకు ముఖ్యం కాదు. మనకు కావల్సింది ఈ ఐపిఎల్ ట్రోఫి.  ఎట్టకేలకు దాన్ని సాధించాం.  జట్టు సభ్యులంతా సమిష్టిగా రాణించడం  వల్లే ఈ గెలుపు సాధ్యమయ్యింది.

ముఖ్యంగా చెన్నైతో జరిగిన  ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో మనం తప్పులు చేశాం. కానీ సరైన సమయంలో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాం. అలా  అద్భుతంగా తిరిగి మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే గెలిచాం. ఈ ట్రోఫీని  ముద్దాడగలిగాం.'' అని జయవర్దనే కాస్త బావోద్వేగంతో, మరికొంత గెలుపు జోష్ తో ముంబై ఆటగాళ్ల ఎదుట  ప్రసంగించారు. 

🗣| "No purple caps, no orange caps but who cares? We've got this 🏆" - pic.twitter.com/k4Vf1p7gfq

— Mumbai Indians (@mipaltan)

click me!