ఐపిఎల్ 2019 ఫైనల్ విజయంపై రోహిత్ ఏమన్నాడంటే...

By Arun Kumar PFirst Published May 13, 2019, 2:27 PM IST
Highlights

ఇండియన్  ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్లేవంటే ముందుగా వినిపించే పేర్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే అభిమానులకు కావల్సినంత క్రికెట్ మజా లభిస్తుంది. అలాంటిది టైటిల్ కోసం ఫైనల్లో ఢీకొంటే ఎలా వుంటుందో ఆదివారం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ ను చూస్తే తెలుస్తుంది. ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా చివరకు ముంబై ఇండియన్స్ దే పైచేయిగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించిన  ముంబై జట్టు ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. ఈ గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 
 
తమ విజయం ఏ ఒక్కరికి చెందింది కాదని...ఇది జట్టు సమిష్టి గెలుపని మ్యాచ్ అనంతకరం రోహిత్ వెల్లడించాడు. కీలక సమయంలో ఏ ఒక్కరి నిర్ణయంపైనో ఆధారపడకుండా జట్టు సభ్యులమంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకున్నామన్నాడు. క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో అందరం కలిసి ఓ అవగాహనతో ముందుకు కదిలామని...ఈ నిర్ణయాల్లో  ప్రతి ఒక్కరి ప్రమేయం వుంది కాబట్టి అందరు బాధ్యతాయుతంగా వ్యవహరించారని రోహిత్ తెలిపాడు. 

ఇక మలింగ వేసిన ఫైనల్ ఓవర్ గురించి రోహిత్ మాట్లాడుతూ...''చివరి  బంతికి అంపైర్ చేయిని  పైకెత్తి ఔటైనట్లు సంకేతమివ్వగానే సంతోషాన్ని అదుపుచేసుకోలేకపోయాను. ఒక్క ఉదుటన తనకు తెలియకుండానే పరుగు మొదలుపెట్టాను. అవి చాలా అపురూపమైన క్షణాలు. అయితే చివరి ఓవర్లలో తాము తీసుకున్న సమిష్టి నిర్ణయాల వల్లే ఈ ఫలితం వచ్చిందని నమ్ముతున్నా.  జట్టులోని కొంతమంది సీనియర్లం  కలిసి గెలుపు కోసం పలుమార్లు చర్చించాం. ఇది తమ గెలుపుకు ఎంతో ఉపయోగపడింది.'' అని వెల్లడించాడు. 

''మేం ఫీల్డింగ్ లో కొన్ని తప్పులు చేశాం. కొన్ని క్యాచ్ లు మిస్ చేయడంతో పాటు పీల్డింగ్ లోనూ కొన్ని తప్పులు చేశాం. దీంతో చివరకు మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. చివరకు మళ్లీ దారిలోకి వచ్చి మంచి బౌలింగ్, ఫీల్డింగ్ తో ఆకట్టుకుని జట్టును గెలిపించుకున్నాం'' అని రోహిత్ ఐపిఎల్ ఫైనల్ విజయంపై స్పందించాడు. 

click me!