ముంబై విజయంలో అతడిదే కీలక పాత్ర: యువ కిలాడిపై సచిన్ ప్రశంసలు

By Arun Kumar PFirst Published May 13, 2019, 1:40 PM IST
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం తెలిసిందే. నిన్న ఆదివారం హైదరాబాద్  ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ముంబై నాలుగో సారి ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే 149 పరుగులు తక్కువ స్కోరును కాపాడుకోవడంతో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. ఇలా అదరగొట్టిన బౌలర్లలో రాహుల్ చాహర్ అద్భుతమైన బౌలింగ్  క్రికెట్ లెజెండ్,  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా సచినే వెల్లడించాడు. 

''ముంబై ఇండియన్స్ జట్టు తరపున చాహర్  మొదటి మ్యాచ్ ఆడినప్పుడే అతడి బౌలింగ్ శైలి తనకు నచ్చింది. అతడు తప్పకుండా రాణిస్తాడని అప్పుడే తాను మహేల జయవర్ధనే కు చెప్పాను. అతడిలోని టాలెంట్ కు వైవిద్యమైన బౌలింగ  యాక్షన్ తోడవడం కలిసొచ్చింది. ముఖ్యంగా చెన్నైపై జరిగిన ఫైనల్లో చాహర్ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. క్లిష్ట సమయంలో జట్టును ఆదుకుని మ్యాచ్ ని మలుపుతిప్పాడు'' అంటూ యువ బౌలర్ చాహర్ ను సచిన్ ప్రశంసించాడు.

ఈ మ్యాచ్ లో చాహర్ 4 ఓవర్లు పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. 24 బంతులేసిన చాహర్ 13 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.  అంతేకాకుండా కీలకమైన చెన్నై బ్యాట్ మెన్ సురేశ్ రైనా ను పెవిలియన్ కు పంపించాడు. మిడిల్ ఓవర్లలో ఇతడి  బౌలింగ్ కారణంగానే  ముంబై గెలుపు ఆశలు సజీవంగా వుంచుకుని డెత్ ఓవర్లలో చెన్నైతో పోరాడి గెలవగలిగింది. 

రాహుల్ చాహర్ పై ముంబై కోచ్ జయవర్ధనే  ప్రశంసలు కురిపించాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టి  రాహుల్ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడని జయవర్ధనే అభినందించాడు. 

click me!