సిక్సర్ల మోత... అజారుద్దీన్, పునీత్ విధ్వంసానికి రికార్డులు బద్దలు

By Arun Kumar PFirst Published Jan 14, 2021, 11:06 AM IST
Highlights

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో మిజోరాం జట్టుతో జరిగిన మ్యాచ్ లో పునీత్ సిక్సర్ల మోత మోగించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

చెన్నై: దేశవాళీ క్రికెట్లో మేఘాలయా టీం కెప్టెన్ పునీత్ బిస్త్ తన ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డు మోత మోగించాడు. ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో మిజోరాం జట్టుతో జరిగిన మ్యాచ్ లో పునీత్ సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో చెలరేగి 146 పరుగులు సాధించాడు. దీంతో అతడి పేరిట అద్భుత రికార్డు నమోదవడంతో పాటు మేఘాలయ జట్టు 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇప్పటివరకు టి20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేరిట వుంది. అతడి ఒకే ఇన్సింగ్స్ లో 15సిక్సర్లు బాదగా ఆ రికార్డును తాజా ఇన్నింగ్స్ తో పునీత్ బద్దలుగొట్టాడు. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట వుంది.అతడు ఒకే ఇన్సింగ్స్ లో అత్యధికంగా 18 సిక్సర్లు బాదాడు. 

ఇదే టోర్నీలో కేరళ వర్సెస్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ యువ ఆటగాడు అజారుద్దిన్ విధ్వసకర బ్యాటింగ్ తో శతకం బాదాడు. అతడు కేవలం 54 బంతుల్లో ఫోర్లు, 11 సిక్సర్లతో 137 నాటౌట్‌ గా నిలిచాడు. దీంతో ముంబైపై కేరళ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
 

click me!