సిరాజ్ అంత గొప్ప పని చేసాడు: ఆస్ట్రేలియా క్రికెటర్ కితాబు

By team teluguFirst Published Jan 14, 2021, 9:23 AM IST
Highlights

మున్ముందు మహ్మద్‌ సిరాజ్‌ దారిలోనే ఇతర క్రికెటర్లు నడిచేందుకు అవకాశం ఏర్పడిందని లయాన్‌ అన్నాడు. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా దురభిమానులు మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

క్రీడల్లో జాతి వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. కరోనా అనంతరం ఆరంభమైన ప్రపంచ క్రికెట్‌ను వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్లు మోకాలిపై కూర్చోని సంఘీభాగం తెలుపుతూ ఆరంభించాయి. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ నినాదంతో వెస్టిండీస్‌ జట్టు ఉద్యమమే చేస్తోంది. 

అయితే, మైదానంలో అభిమానుల నుంచి ఎదురయ్యే జాతి వివక్ష వ్యాఖ్యలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు భారత క్రికెటర్‌, హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ కొత్త ఒరవడి సృష్టించాడని ఆస్ట్రేలియా క్రికెటర్‌ నాథన్‌ లయాన్‌ అన్నాడు. 

మున్ముందు మహ్మద్‌ సిరాజ్‌ దారిలోనే ఇతర క్రికెటర్లు నడిచేందుకు అవకాశం ఏర్పడిందని లయాన్‌ అన్నాడు. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా దురభిమానులు మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అభిమానుల స్టాండ్స్‌లో మద్యం తాగిన అభిమానులపై ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌కు మహ్మద్‌ సిరాజ్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మహ్మద్‌ సిరాజ్‌ మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడని, ఇతర క్రికెటర్లు ఇటువంటి చేదు సంఘటనల్లో అతడిని అనుసరిస్తారని లయాన్‌ అభిప్రాయపడ్డాడు.

ఇటువంటి పరిస్థితిని గతంలో ఎదుర్కున్న క్రికెటర్లు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ సిరాజ్ మాత్రం  అందుకు భిన్నంగా నూతన సంప్రదాయానికి తెరతీస్తూ ఆన్ ఫీల్డ్ అంపైర్ కి ఫిర్యాదు చేసి చాలా హుందాగా వ్యవహరించాడు. 

click me!