109 బంతులాడి 7 పరుగులా: కేంద్ర మంత్రికి హనుమ విహారి ఘాటు రిప్లై

Published : Jan 14, 2021, 10:00 AM IST
109 బంతులాడి 7 పరుగులా: కేంద్ర మంత్రికి హనుమ విహారి ఘాటు రిప్లై

సారాంశం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో హనుమ విహారి ఆటపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దానికి హనుమ విహారి హుందాగా సమాధానం ఇచ్చాడు.

సిడ్నీ: తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ ఘాటు రిప్లై ఇచ్చాడు. తనపై అవమానకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేసిన సుప్రీయోకు ఆయన షాక్ ఇచ్చాడు. తద్వారా సోషల్ మీడియాలో హీరోగా మారాడు. విహారికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ కూడా ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో హనుమ విహారి బ్యాటింగ్ మీద సర్వత్రా ప్రశంసలు అందుతుండగా బాబుల్ సుప్రియో మాత్రం తప్పు పట్టారు. ఇండియా ఓటమి పాలు కాకుండా ఆశ్విన్ తో కలిసి 259 బంతులను విహారి డిఫెండ్ చేశాడు. పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో కూడా విరోచితంగా ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కున్నాడు. 

ఏడు పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడడం నేరంని, టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని హనుమ విహారి అడ్డుకున్నాడని, క్రికెట్ ను హత్య చేశాడని సుప్రియో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విజయావకాశాలను నిలుపలేని విహారి ఓ నేరస్థుడని అన్నారు. దానికి ఓ నోట్ కూడా పెట్టారు. క్రికెట్ గురించి తనకు ఏమీ తెలియదని తనకు తెలుసునని అంటూ సుప్రియో ఈ నెల 11వ తేదీన ట్వీట్ చేశారు. 

విహారిని అలా అవమానించడమే కాకుండా విహారిని బిహారీగా అభివర్ణించారు. దానికి హనుమ విహారి హుందాగా సమాధానం ఇచ్చాడు. హనుమ విహారి అని మంత్రికి సమాధానమిచ్చాడు. దాంతో సుప్రియోకు అదిరిపోయే జవాబు ఇచ్చాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

"డియర్ హనుమా, బాబు అజ్ఞానాన్ని దయచేసి పట్టించుకోకు, కుంటి కాలుతో ఇండియాను ఓటమి నుంచి రక్షించావు, మిత్రమా, నీకు జేజేలు" అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !