లబుషేన్ సెంచరీ... భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా... మాథ్యూ వేడ్‌తో కలిసి...

Published : Jan 15, 2021, 11:23 AM IST
లబుషేన్ సెంచరీ... భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా... మాథ్యూ వేడ్‌తో కలిసి...

సారాంశం

రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్... టెస్టుల్లో ఐదో సెంచరీ నమోదు... నాలుగో వికెట్‌కి వేడ్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం... 45 పరుగులు చేసి అవుటైన వేడ్... నటరాజన్‌కి తొలి వికెట్...

ఆస్ట్రేలియా యంగ్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్... అద్భుత సెంచరీతో చెలరేగాడు. భారత ఫీల్డర్లు క్యాచులు జారవిరచడంతో రెండు సార్లు బతికిపోయిన లబుషేన్... 195 బంతుల్లో 9 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. మాథ్యూ వేడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 113 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు లబుషేన్.

లబుషేన్‌కి ఇది ఐదో టెస్టు సెంచరీ...ఫీల్డర్లు క్యాచులు వదిలేయడం, పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్ రెండూ కూడా లబుషేన్‌కి బాగా కలిసొచ్చాయి. 87 బంతుల్లో 6 ఫోర్లత 45 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ని నటరాజన్ అవుట్ చేశాడు.

తొలి టెస్టు ఆడుతున్న నటరాజన్‌కి ఇది తొలి టెస్టు వికెట్. 200 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు లబుషేన్. 
 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !