మరో వికెట్ డౌన్... నవ్‌దీప్ సైనీకి గాయం... ఓవర్ మధ్యలోనే పెవిలియన్‌కి...

Published : Jan 15, 2021, 09:15 AM IST
మరో వికెట్ డౌన్... నవ్‌దీప్ సైనీకి గాయం... ఓవర్ మధ్యలోనే పెవిలియన్‌కి...

సారాంశం

బౌలింగ్ చేస్తూ గాయపడిన నవ్‌దీప్ సైనీ... సైనీ ఓవర్ ఫినిష్ చేసిన రోహిత్ శర్మ... ఇప్పటికే గాయాలతో ఆరుగురు ప్లేయర్లను మిస్ చేసుకున్న టీమిండియా...

ఇప్పటికే ఆరుగురు భారత క్రికెటర్లు గాయాలతో టెస్టు సిరీస్ మధ్యలోనే తప్పుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, షమీ వంటి సీనియర్లు లేకుండానే గబ్బా టెస్టులో బరిలో దిగింది భారత జట్టు. పట్టుమని 10 టెస్టుల అనుభవం కూడా లేని భారత బౌలింగ్ యూనిట్... 87 పరుగులుకే 3 వికెట్లు తీసి సత్తా చాటింది.

అయితే నాలుగో టెస్టులో కూడా భారత జట్టు మరో ప్లేయర్‌ గాయపడ్డాడు. నవ్‌దీప్ సైనీ తాను వేసిన 8వ ఓవర్‌లో గాయపడి, పెవిలియన్ చేరాడు. 7.5 ఓవర్లు మాత్రమే వేసిన సైనీ... 21 పరుగులు ఇచ్చాడు. 8వ ఓవర్ ఐదో బంతికి సైనీ బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ అజింకా రహానే జారవిడిచాడు. అదే బంతికి సైనీ గాయంతో పెవిలియన్ చేరాడు.

ఆ మిగిలిన బంతిని రోహిత్ శర్మ వేశాడు. సైనీ కూడా గాయంతో బరిలో దిగకపోతే అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా యంగ్ పేసర్ కార్తీక్ త్యాగి ఆడాల్సి ఉంటుంది. 18 మంది ప్లేయర్లతో టెస్టు సిరీస్ ఆరంభించిన భారత జట్టులో ఏడుగురు ప్లేయర్లు గాయాలతో సిరీస్ నుంచి తప్పుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు