Legends Cricket Trophy 2024: రాబోయే లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 2 లో టీమిండియా ప్రపంచ కప్ విజేత ప్లేయర్ యువరాజ్ సింగ్ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టులో చేరాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది.
Legends Cricket Trophy 2024 Yuvraj Singh : టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్, భారత ప్రపంచ కప్ విన్నింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాయకత్వంలో పాకిస్తాన్ ప్లేయర్లు క్రికెట్ ఆడనున్నారు. ఈ వార్త మీకు మస్తు క్రేజీగా అనిపించినా ఇది నిజం.. ! రాబోయే లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ (ఎల్సీటీ) సీజన్ 2 కోసం భారత దిగ్గజం యువరాజ్ సింగ్ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ కెప్టెన్, ఐకాన్ ప్లేయర్ గా ఎంపికయ్యాడు. బాబర్ ఆజమ్, రషీద్ ఖాన్, కీరన్ పొలార్డ్, ఇమామ్ ఉల్ హక్, నసీమ్ షా, మతీషా పథిరానా, రహ్మతుల్లా గుర్బాజ్, ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్ వంటి ప్రముఖ ఆటగాళ్లతో కూడిన జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు.
యువరాజ్ చేరిక జట్టు నైపుణ్యం, నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందనే చెప్పాలి. రాబోయే టోర్నమెంట్లో నాయకత్వం వహించడానికి న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ ను సిద్ధం చేస్తుంది. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 2లో న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ పాల్గొనడంపై యువరాజ్ నాయకత్వ పాత్ర ప్రకటన సర్వత్రా ఆసక్తిని పెంచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, క్రికెట్ ప్రియులను మరింత ఉత్సాహపరిచింది.
చరిత్ర సృష్టించిన చెన్నై మాజీ ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్.. టీ20ల్లో మరో రికార్డు..
యువరాజ్ సింగ్ అపార అనుభవం, నైపుణ్యం 90 బాల్స్ ఫార్మాట్ టోర్నమెంట్ లో జట్టు ప్రదర్శనను బాగా మెరుగుపరుస్తుందని ఫ్రాంచైజీ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ విశ్వాసం వ్యక్తం చేసింది. యువరాజ్ చేరికతో జట్టులో నైపుణ్యం, బలం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయనీ, రాబోయే టోర్నమెంట్లో నాయకత్వం వహించడానికి న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ సంసిద్ధతను బలపరుస్తుందని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.
90 బంతుల ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ మార్చి 7 నుంచి 18 వరకు శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. 20 ఓవర్ల ఫార్మాట్ లో ఆడిన మొదటి సీజన్ గత ఏడాది మార్చి 22 నుంచి మార్చి 30 వరకు ఘజియాబాద్ లో జరిగింది. ఎల్సీటీ ప్రారంభ సీజన్ లో ఫైనల్ వర్షార్పణం కావడంతో ఇండోర్ నైట్స్, గౌహతి అవెంజర్స్ సంయుక్త విజేతలుగా ప్రకటించబడ్డాయి. రెండో సీజన్ ఎల్సీటీని 90 బాల్స్ ఫార్మాట్ లో జరగనుంది. ఇక్కడ ప్రతి జట్టు ఐదుగురు బౌలర్లు చెరో మూడు ఓవర్లు వేయడానికి అనుమతిస్తారు.
IND VS ENG: ఉత్కంఠను పెంచుతున్న రాజ్‌కోట్ టెస్టు.. ఇంగ్లాండ్ టీమ్ లోకి స్టార్ బౌలర్ !