Imran Tahir: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులో ఉన్న ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు.
Former Chennai Super Kings player Imran Tahir: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 32 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో ఆడేందుకు చోటు సంపాదించి.. తనదైన ఆటతో అద్భుతమైన బౌలర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టు తరపున 20 టెస్టులు, 107 వన్డేలు, 38 టీ20లు ఆడిన అతను ఇప్పుడు క్రికెట్ లో మరో రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-5 బౌలర్లలో ఒకడిగా, 500 వికెట్లు తీసుకున్న ప్లేయర్ గా రికార్డు నెలకోల్పాడు. ఇమ్రాన్ తాహిర్ 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌షిప్ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులో ఉన్న ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. అతను ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సిరీస్‌లో రంగ్‌పూర్ రైడర్స్ జట్టుకు ఆడుతున్నాడు. తాజా మ్యాచ్ లో ఇమ్రాన్ తాహిర్ 5 వికెట్లు తీసుకోవడంతో టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన 4వ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
1. డ్వేన్ బ్రావో - 624 వికెట్లు
2. రషీద్ ఖాన్ - 556 వికెట్లు
3. సునీల్ నరైన్ - 532 వికెట్లు
4. ఇమ్రాన్ తాహిర్ - 500 వికెట్లు
IND VS ENG: ఉత్కంఠను పెంచుతున్న రాజ్‌కోట్ టెస్టు.. ఇంగ్లాండ్ టీమ్ లోకి స్టార్ బౌలర్ !