యాషెస్ సిరీస్‌పై మహేష్ ట్వీట్! టీమిండియా ఆడినప్పుడు ఒక్క ట్వీట్ వేయని సూపర్ స్టార్...

Published : Jun 17, 2023, 01:25 PM IST
యాషెస్ సిరీస్‌పై మహేష్ ట్వీట్! టీమిండియా ఆడినప్పుడు ఒక్క ట్వీట్ వేయని సూపర్ స్టార్...

సారాంశం

తొలి టెస్టు తొలి రోజు 78 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్.... ‘వావ్... జస్ట్ వావ్’ అంటూ బజ్ బాల్‌ కాన్సెప్ట్‌పై మహేష్ రియాక్షన్.. 

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న టెస్టు సిరీసుల్లో యాషెస్ సిరీస్ టాప్‌లో ఉంటుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే హోరాహోరీ ఫైట్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురుచూస్తారు. ఈ లిస్టులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు..

యాషెస్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు, 78 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...

జాక్ క్రావ్లే 61 పరుగులు చేయగా బెన్ డక్లెట్ 12, ఓల్లీ పోప్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రెండేళ్లుగా బీభత్సమైన ఫామ్‌లో దూసుకుపోతున్న జో రూట్ 152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 118 పరుగులు చేసి... టెస్టు కెరీర్‌లో 30వ సెంచరీ అందుకున్నాడు..

యంగ్ బ్యాటర్ హారీ బ్రూక్ 37 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేయగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 8 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. గాయం కారణంగా ఏడాది బ్రేక్ తర్వాత ఆడుతున్న జానీ బెయిర్‌స్టో 78 బంతుల్లో 12 ఫోర్లతో 78 పరుగులు చేశాడు.

మొయిన్ ఆలీ 18, స్టువర్ట్ బ్రాడ్ 16 పరుగులు చేశారు. జో రూట్ ఇంకా క్రీజులో బ్యాటింగ్ చేస్తుండగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించి, షాక్ ఇచ్చాడు బెన్ స్టోక్స్. దీంతో తొలి రోజే బ్యాటింగ్‌కి వచ్చిన ఆస్ట్రేలియా, 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది..

తొలి రోజే, అది కూడా ఆలౌట్ కాకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై మహేష్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ‘398-8, నేను సరిగ్గానే చదువుతున్నానా? వావ్.. జస్ట్ వావ్... క్రికెట్‌లో కొత్త శకాన్ని చూస్తున్నా... బజ్ బాల్’ అంటూ ఫైర్ ఎమోజీలను ట్వీట్ చేశాడు మహేష్ బాబు..

బజ్ బాల్ కాన్సెప్ట్ గురించి స్పందించడం బాగానే ఉంది కానీ అంతకుముందు టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో ఒక్క ట్వీట్ కూడా వేయలేదు మహేష్.. దీంతో టీమిండియా ఫ్యాన్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు...

టీమిండియా గెలుస్తుందనే నమ్మకం మనవాడైన మహేష్‌కి కూడా లేదని, అందుకే దాని గురించి ట్వీట్ కూడా చేయలేదని వాపోతున్నారు. కనీసం మహేష్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చూసి ఉంటాడా? మనోళ్లు ఎలా ఆడతారో తెలిసి ఆ సాహసం కూడా చేసి ఉండడేమో అంటూ మరోసారి భారత క్రికెట్ బోర్డుని, భారత జట్టుని ట్రోల్ చేస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు..

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూర్ కారం’ సినిమా చేస్తున్న మహేష్, సమయం దొరికినప్పుడల్లా ‘మేమ్ ఫేమస్’ వంటి చిన్న సినిమాలు చూస్తూ, వాటిని మెచ్చుకుంటూ ట్వీట్లు వేస్తున్నాడు. 


 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?