ఆస్ట్రేలియాకి మరో షాక్... గాయంతో ఆల్‌రౌండర్ దూరం... ఫించ్ అనుమానమే...

Published : Dec 05, 2020, 01:41 PM IST
ఆస్ట్రేలియాకి మరో షాక్... గాయంతో ఆల్‌రౌండర్ దూరం... ఫించ్ అనుమానమే...

సారాంశం

గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమైన ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆస్టర్ అగర్...  అగర్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ ఎంపిక.. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయంపై ఇంకా రాని క్లారిటీ...

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియాకి రెండో టీ20 మ్యాచుకి ముందు మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆస్టర్ అగర్... టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. మూడో వన్డే ఆడిన ఆస్టన్ అగర్... శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్‌‌ను అవుట్ చేశాడు.

10 ఓవర్లలో 44 పరుగులే ఇచ్చిన అగర్... బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు చేసి రాణించాడు. గాయం కారణంగా మొదటి టీ20 ఆడని అగర్... మిగిలిన రెండు టీ20లకు దూరం కానున్నాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో గాయపడిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా రెండో టీ20లో బరిలో దిగడం అనుమానమే.

ఫించ్ గాయానికి స్కానింగ్ చేసిన వైద్యులు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆసీస్ కెప్టెన్ ఆడేది లేనిదీ తేల్చబోతున్నారు. మొదటి రెండు వన్డేలు గెలిచిన సిడ్నీ  మైదానంలో మిగిలిన రెండు టీ20 మ్యాచులు ఆడబోతోంది ఆసీస్. ఆదివారం డిసెంబర్ 6న రెండో టీ20, మంగళవారం డిసెంబర్ 8న చివరి టీ20 మ్యాచులు జరగనున్నాయి. గాయం కారణంగా ఈ రెండు టీ20లకు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే