డోప్ టెస్టులో ఫెయిల్ అయిన వుమెన్ ఆల్‌రౌండర్... నాలుగేళ్ల నిషేధం విధించిన...

Published : Jun 29, 2021, 01:19 PM IST
డోప్ టెస్టులో ఫెయిల్ అయిన వుమెన్ ఆల్‌రౌండర్... నాలుగేళ్ల నిషేధం విధించిన...

సారాంశం

మధ్యప్రదేశ్ సీనియర్ టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న 23 ఏళ్ల ఆల్‌రౌండర్ అన్షులా రావు... నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్టు నిర్థారణ... ఆ డ్రగ్ తీసుకోవడానికి సరైన కారణం చెప్పలేకపోయిన మహిళా క్రికెటర్...

మధ్యప్రదేశ్‌ చెందిన మహిళా ఆల్‌రౌండర్ అన్షులా రావుపై నాలుగేళ్ల నిషేధం విధించింది భారత క్రికెట్ బోర్డు. మార్చి 2020లో నిర్వహించిన డోప్ టెస్టులో అన్షులా రావు, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది...
23 ఏళ్ల అన్షులా రావు, మధ్యప్రదేశ్ సీనియర్ టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉంది.

మార్చిలో నిర్వహించిన డోప్ టెస్టులో ఆమె, నిషేధిత 19-నోరన్‌డ్రోస్టర్‌వన్ వాడినట్టు తేలింది... గత నెలలో అన్షులా రావు అప్పీలును స్వీకరించిన యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ (ఏడీడీపీ), ఆమె ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు.

ఆ డ్రగ్‌ను ఎందుకు వాడావనే ప్రశ్నకు ఆమె సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అన్షులా రావుపై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. 
మధ్యప్రదేశ్ తరుపున అండర్23 టీ ట్రోఫీలో పాల్గొన్న అన్షులా రావు, బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా, బౌలింగ్‌లో ఓపెనింగ్ బౌలర్‌గా వ్యవహారించింది. 

PREV
click me!

Recommended Stories

Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !
సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?