న్యూజిలాండ్ విజయం...కేన్ విలయమ్సన్ కి బిగ్ రిలీఫ్..

By telugu news teamFirst Published Jun 24, 2021, 12:34 PM IST
Highlights

రెండు సంవత్సరాల క్రితం లార్డ్స్ లో ఇంగ్లాండ్ చేతిలో కూడా ఓటమి పాలయ్యారు. ఇరు జట్లు సమంగా స్కోర్ చేసినా సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ ఓటమి పాలయ్యింది

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ ఓటమిపాలైంది. న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ విజయంతో.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారీ ఉపశమనం పొందాడు. దాదాపు ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. కాగా... ఈ విజయం పట్ల కేన్ .. భారీ ఉపశమనం.. సంతృప్తి వ్యక్తం చేశాడు.

న్యూజిలాండ్ జట్టు.. ఈ టెస్టు ఛాంపియన్ షిప్... దాదాపు ఆరుసార్లు ఓటమిపాలవ్వడం గమనార్హం.  కాగా... 2015లో మెల్ బోర్న్ లో.. ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిపాలయ్యింది.  రెండు సంవత్సరాల క్రితం లార్డ్స్ లో ఇంగ్లాండ్ చేతిలో కూడా ఓటమి పాలయ్యారు. ఇరు జట్లు సమంగా స్కోర్ చేసినా సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ ఓటమి పాలయ్యింది.  కాగా.. చివరగా.. టీమిండియాతో తలపడిన మ్యాచ్ లో.. న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.

అప్పటికీ.. ఈ మ్యాచ్ లో వరుణుడు ఆటంకం కలిగించినప్పటికీ.. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో.. చివరకు విజయం న్యూజిలాండ్ ని కైవసం చేసుకుంది. 

ఈ విజయం తనకు కొత్త అనుభూతిని కలిగించిందని కేన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం విశేషం. మొదటి సెమీ ఫైనల్ ఏకపక్షంగా సాగినా.. రెండోది మాత్రం చాలా ఆసక్తికరంగా సాగిందని ఆయన పేర్కొన్నారు. ఇది తమకు మొదటి అధికారిక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ అని.. అందుకే ఈ విజయం విభిన్న అనుభూతిని ఇచ్చిందని కేన్ పేర్కొన్నారు. 
 

click me!