LSG vs PBKS: పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చివరలో మెరుపులు మెరిపించాడు. 22 బంతుల్లోనే 43 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
LSG vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్నా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. పంజాబ్ కింగ్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది లక్నో. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్ క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్ పేలుడు బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
లక్నో సూపర్‌జెయింట్స్ ఓపెనర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలో 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, కేఎల్ రాహుల్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయితే, ఆ తర్వాత వచ్చిన మరో యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ 6 బంతుల్లో 9 పరుగులు చేసి త్వరగానే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలోనే ఓపెనర్ క్వింటన్ డి కాక్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన నికోలస్ పూరన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. ఆఖరలో కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది లక్నో టీమ్. బౌలింగ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున శామ్ కుర్రాన్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కగిసో రబాడ, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు.
One match in, already the highest score at Ekana 🔥✅ pic.twitter.com/xPycHO38X3
— Lucknow Super Giants (@LucknowIPL)ఐపీఎల్ లో ఆర్సీబీ సిక్సర్ల మోత.. సరికొత్త రికార్డు !