ఐపీఎల్ లో ఆర్సీబీ సిక్స‌ర్ల మోత‌.. స‌రికొత్త రికార్డు !

By Mahesh Rajamoni  |  First Published Mar 30, 2024, 8:53 PM IST

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ రికార్డుల మోత కొనసాగుతోంది. ఐపీఎల్ లో ఆర్సీబీ ఇప్ప‌టివ‌ర‌కు కప్ గెల‌వ‌లేక‌పోయినా రికార్డుల ప‌రంగా అనేక మైలురాళ్ల‌ను అందుకుంది. 
 


Bengaluru's new record in IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ కప్ గెలవనప్పటికీ, రికార్డుల పరంగా అనేక మైలురాళ్లను అందుకుంటునే ఉంది. ఐపీఎల్ 2024 మూడో మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసినా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)పై ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మ‌రో రికార్డును త‌న పేరున లిఖించుకుంది. ఐపీఎల్ 2024 10వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 182 పరుగులు చేసింది.

183 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. అయితే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ మొత్తం 11 సిక్సర్లు కొట్టారు. జట్టు తరఫున విరాట్ కోహ్లి నాలుగు సిక్సర్లు, కెమెరూన్ గ్రీన్ రెండు సిక్సర్లు, దినేష్ కార్తీక్ మూడు సిక్సర్లు, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్ వెల్ ఒక్కో సిక్స్ బాదారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 1500 సిక్సర్లు కొట్టిన రికార్డుల లిస్టులో ఆర్సీబీ కూడా చేరింది. ఈ లిస్టులో ముంబై ఇండియ‌న్స్ మొద‌టి స్థానంలో ఉంది. ముంబై జ‌ట్టు త‌ర్వాత ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

Latest Videos

undefined

IPL 2024: శ్రేయాస్ అయ్యర్‌తో మిస్టరీ గర్ల్.. ఎవ‌రీ త్రిషా కులకర్ణి? ఫొటోలు వైర‌ల్ !

ఐపీఎల్ లో 1500 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్లలో ముంబై ఇండియన్స్ 1575 సిక్సర్లతో టాప్ లో ఉంది. ఆ త‌ర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 1421 సిక్సర్లు కొట్టి మూడో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 1405 సిక్సర్లు, కోల్ కతా నైట్ రైడర్స్ 1378 సిక్సర్లతో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

Most Sixes by IPL Teams:
MI - 1575
RCB - 1500
CSK - 1421
PBKS - 1405
KKR - 1365
RCB is the Second Team to complete 1500 Sixes in IPL. pic.twitter.com/4kR7amFbZC

— mahe (@mahe950)

 

రింకూ సింగ్ కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ..

click me!