LSG vs PBKS Highlights : శిఖ‌ర్ ధావ‌న్ పోరాటం వృథా.. మయాంక్ యాదవ్ మాయాజాలంతో పంజాబ్ పై ల‌క్నో గెలుపు

By Mahesh Rajamoni  |  First Published Mar 31, 2024, 12:29 AM IST

LSG vs PBKS Highlights : పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించడంతో ఐపీఎల్ 2024 సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని అందుకుంది. సీనియ‌ర్ ప్లేయ‌ర్లు డీకాక్, పూరాన్, పాండ్యాలు బ్యాటింత్ తో రాణించగా, మ‌యాంక్ యాద‌వ్ అరంగేట్రంతోనే బాల్ తో అద‌ర‌గొట్టాడు.
 


LSG vs PBKS Highlights : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్నా స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన ల‌క్నో టీమ్ ఈ సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని అందుకుంది. ల‌క్నో గెలుపులో క్వింట‌న్ డీకాక్, నికోల‌స్ పూరాన్, కృనాల్ పాండ్యా, మ‌యాంక్ యాద‌వ్ లు కీల‌క పాత్ర పోషించారు.

ల‌క్నో ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. 

Latest Videos

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో ప్లేయ‌ర్లు ధ‌నాధన్ ఇన్నింగ్స్ తో 199 పరుగులు కొట్టారు. లక్నో ప్లేయ‌ర్ల‌లో క్వింటన్‌ డి కాక్ (54) అరంభంలో అద‌ర‌గొట్ట‌గా, మ‌ధ్య‌లో నికోలస్‌ పూరన్ (42), చివ‌ర‌లో కృనాల్ పాండ్యా (43) లు బ్యాటింగ్ మెరుపులు మెరిపించారు. దీంతో ల‌క్నో టీమ్ 8 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో సామ్ క‌ర‌న్ 3 వికెట్లు, అర్ష‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నారు. ర‌బాడ‌, రాహుల్ చ‌హార్ లు చెరో వికెట్ తీశారు. 

అద‌ర‌గొట్టిన శిఖ‌ర్ ధావ‌న్, జానీ బెయిర్ స్టో.. 

ఇక 200 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెన‌ర్లు మంచి శుభారంభం అందించారు. శిఖ‌ర్ ధావ‌న్, జానీ బెయిర్ స్టో లు 100 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. శిఖ‌ర్ ధావ‌న్ 30 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. పంజాబ్ వైపు మ్యాచ్ గెలుపు క‌నిపించిన స‌మ‌యంలో.. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయ‌ర్ మ‌యాంక్ యాద‌వ్ త‌న బౌలింగ్ మాయ‌తో పంజాబ్ ఆట‌గాళ్ల‌ను దెబ్బ‌తీశాడు. మ‌రో ఎండ్ లో దూకుడుగా ఆడుతున్న జానీ బెయిర్ స్టో ను 42 ప‌రుగుల వ‌ద్ద మ‌యాంత్ ఔట్ చేశాడు. ఇది త‌న ఐపీఎల్ కెరీర్ లో తొలి వికెట్. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన ప్ర‌భుసిమ్రాన్, జితేష్ శ‌ర్మ‌లు ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేకపోయారు. వీరిద్ద‌రూ ఔటైన త‌ర్వాత శిఖ‌ర్ ధావ‌న్ కీల‌క స‌మ‌యంలో 70 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు. చివ‌ర‌లో లివింగ్ స్టోన్ మెరుపులు మెరిపించినా అప్ప‌టికే మ్యాచ్ ల‌క్నో గ్రౌండ్ లోకి వెళ్లింది.

మ‌యాంక్ యాద‌వ్ అరంభం అదిరింది.. 

ఈ మ్యాచ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్ పేసర్ మయాంక్ యాదవ్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. మ్యాచ్ సమయంలో, మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024 లో వేగవంతమైన బంతిని వేశాడు. 12వ ఓవర్ మొదటి బంతికి 155.8 కి.మీ. బంతిని విసిరాడు. కీల‌క‌మైన‌ జానీ బెయిర్‌స్టో ఔట్ చేసి ఐపీఎల్ లో త‌న తొలి వికెట్ ను తీసుకున్నాడు. అలాగే, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ కూడా తీశాడు. మయాంక్ జితేష్ శర్మను కూడా పెవిలియ‌న్ కు పంపి లక్నో వైపు మ్యాచ్ ను తిప్పాడు. మ‌యాంక్ యాద‌వ్ 4 ఓవ‌ర్ల బౌలింగ్ వేసి 27 పరుగులు ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకున్నాడు.

ఎవ‌రీ మ‌యాంక్ యాదవ్? ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఎల్ఎస్జీ పేసర్

click me!