LSG vs PBKS: పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ యంగ్ ప్లేయర్, పేసర్ మయాంక్ యాదవ్ తన అద్భుతమైన బౌలింగ్ తో లక్నో సూపర్ జెయింట్స్ కు విజయాన్ని అందించారు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో అరంగేట్రంలోనే అదరగొట్టాడు.
LSG vs PBKS: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. బుల్లెట్ల లాంటి బంతులు.. మెరుపు వేగంతో నిప్పులు చెరిగే బౌలింగ్ తో లక్నో సూపర్ జెయింట్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు యంగ్ ప్లేయర్ మయాంక్ యాదవ్. ఈ సీజన్ లో అత్యంత వేగవంతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. అత్యంత వేగవంతమైన టాప్-5 డెలివరీల జాబితాలో మయాంక్ అగర్వాల్ నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన మయాంక్ యాదవ్ 155.8 kmph వేగంతో నిప్పులు చెరిగే డెలివరీని వేయడంతో ఐపీఎల్ 2024 సీజన్ ను అద్భుతంగా ప్రారంభించారు. దీంతో మయాంక్ యాదవ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన 21 ఏండ్ల ఈ యంగ్ ప్లేయర్ లక్నో సూపర్ జెయింట్ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఈ స్పీడ్ గన్ ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతిని బౌలింగ్ చేయడం ఈ సీజన్ లో సరకొత్త రికార్డు సృష్టించారు. ఈ లక్నో కుర్రాడు గంటకు 155.8 కి.మీ. వేగంతో బంతులు వేసి పంజాబ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ డెలివరీతో, మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఫాస్టెస్ట్ డెలివరీ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు.
undefined
ఢిల్లీకి చెందిన మయాంక్ గతంలో దేశవాళీ క్రికెట్‌లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 10 T20 మ్యాచ్‌లు, 17 లిస్ట్ ఏ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ రికార్డులను కలిగివున్నాడు. మొత్తం 46 వికెట్లు పడగొట్టాడు. తన తొలి అరంగేట్ర ప్రదర్శనతో పాటు, మయాంక్ యాదవ్ ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ప్లేయర్ గా నిలిచాడు. 155.8 కి.మీ వేగంలో బౌలింగ్ చేసిన ఈ ప్లేయర్ తన తొలి వికెట్ ను 12వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ 12 డాట్ బాల్స్ వేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్నాడు.
Slowest ball of the spell: 139 kph 😂 pic.twitter.com/FwBhQNf31F
— Lucknow Super Giants (@LucknowIPL)
Mayank Yadav so far:
147, 146, 150, 141, 149, 156, 150, 142, 144, 153, 149, 152, 149, 147, 145, 140, 142 kph
AND TWO WICKETS 🔥 pic.twitter.com/9LANNr38jd
ఎవరీ మయాంక్ యాదవ్? ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఎల్ఎస్జీ పేసర్