KXIPvsSRH: పేకమేడలా కుప్పకూలిన సన్‌రైజర్స్... లో స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్...

By team teluguFirst Published Oct 24, 2020, 11:39 PM IST
Highlights

మొదటి వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో...

14 పరుగుల తేడాతో 7 కీలక వికెట్లు కోల్పోయి, చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

మూడు వికెట్లు తీసిన క్రిస్ జోర్డాన్...అర్ష్‌దీప్ సింగ్‌కి 3 వికెట్లు...

IPL 2020: 127 పరుగుల స్వల్ప లక్ష్యం... 6.2 ఓవర్లలోనే 56 పరుగులు చేసిన ఓపెనర్లు... సన్‌రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాతే సీన్ మారిపోయింది. ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడం, సన్‌రైజర్స్ బౌలర్లకు తగ్గట్టుగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడమే కష్టమేంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్ చేరడానికి తొందర పడడంతో ఈజీ అనుకున్న మ్యాచ్ కాస్తా ఆఖరి దాకా ఉత్కంఠభరితంగా సాగింది.19.4 ఓవర్లలో 114 పరుగులకి ఆలౌట్ అయ్యి, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో కలిసి మొదటి వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌ను ఈజీగా గెలుస్తుందని భావించారంతా. అయితే వెంటవెంటనే ఈ ఇద్దరినీ అవుట్ చేసిన పంజాబ్ బౌలర్లు, సమద్‌ను కూడా పెవిలియన్ చేర్చి ఊహించని షాక్ ఇచ్చారు.

డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేస్తే, జానీ బెయిర్ స్టో 20 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌కి ముందుకు వచ్చిన అబ్దుల్ సమద్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మరోసారి ఆదుకున్నాడు విజయ్ శంకర్. తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేసిన మనీశ్ పాండే 29 బంతులు ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు.

పాండే ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం విశేషం. 27 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన విజయ్ శంకర్‌ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. హోల్డర్ 5 పరుగులు చేయగా రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. 

 

click me!