MIvsSRH: చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... వార్నర్ ఒంటరిపోరాటం వృథా...

Published : Oct 04, 2020, 07:31 PM ISTUpdated : Oct 04, 2020, 07:32 PM IST
MIvsSRH: చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... వార్నర్ ఒంటరిపోరాటం వృథా...

సారాంశం

హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేసిన డేవిడ్ వార్నర్... మనీశ్ పాండే, బెయిర్ స్టో మెరుపులు... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్‌ని తిప్పలు పెట్టిన ముంబై...

209 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 174 పరుగులకే పరిమితమైంది. ఓ వైపు వరుస వికెట్లు పడుతున్నా సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. జానీ బెయిర్‌స్టో 25 పరుగులు, మనీశ్ పాండే 30 పరుగులు చేసి అవుట్ కాగా... కేన్ విలియంసన్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. 

గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడిన ప్రియమ్ గార్గ్ 8 పరుగులకే అవుట్ కాగా... 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ అవుట్ కావడంలో మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అబ్దుల్ సమద్, అభిషేక్ వర్మ కాసేపు ప్రయత్నించినా రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమి పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్... అబ్దుల్ సమద్ 20, అభిషేక్ శర్మ 10 పరుగులు చేశారు. బౌల్ట, బుమ్రా, ప్యాటిన్సన్ రెండేసి వికెట్లు తీశారు. 34 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. 

PREV
click me!

Recommended Stories

ఈజీ అన్నావ్‌గా..! ఇప్పుడేంటి మరి.. మంజ్రేకర్‌కు కోహ్లీ సెటైర్..
బంగ్లాదేశ్ పోతేనేం.. ఐసీసీ పక్కా స్కెచ్‌తో టీ20 ప్రపంచకప్‌లోకి పసికూన జట్టు.!