టీ20 ప్రపంచ కప్ 2024 సూప‌ర్-8లో భార‌త్ గెల‌వాలంటే ఈ ప్లేయ‌ర్లు ఉండాల్సిందే.. !

By Mahesh Rajamoni  |  First Published Jun 19, 2024, 12:11 AM IST

T20 World Cup 2024 : భారత్ ఇప్పటివరకు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ల‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో కూడిన బౌలింగ్ విభాగంతో  టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో అమెరికాలో ఆడింది. అయితే, సూప‌ర్-8 మ్యాచ్ ల‌లో కరేబియన్ గడ్డపై భారత జట్టు ఈ కూర్పులో మార్పులు చేయ‌నుంది.
 


T20 World Cup 2024 Super 8 :  టీ20 ప్రపంచ క‌ప్ 2024 లీగ్ ద‌శ‌లో హ్యాట్రిక్ విజ‌యాల‌తో త‌న ప్ర‌యాణం కొన‌సాగించింది. ఒక్క ఓట‌మి కూడా లేకుండా రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు సూప‌ర్-8 లోకి ప్ర‌వేశించింది. ఇప్పుడు సూప‌ర్-8 లో కూడా అదే జోరు కొన‌సాగించాల‌ని చూస్తున్న టీమిండియా.. ముమ్మ‌రంగా ప్రాక్టీస్ సెష‌న్ల‌లో పాల్గొంటున్న‌ది. గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి సెకండ్  రౌండ్‌కు అర్హత సాధించింది.

టీ20 ప్రపంచకప్ 2024 లో లీగ్ మ్యాచ్ ల‌ను టీమిండియాలో అమెరికాలో ఆడింది. అయితే, సూపర్‌-8 మ్యాచ్ ల‌ను వెస్టిండీస్ లో ఆడ‌నుంది. ఇక్క‌డి పిచ్‌లు అనూహ్యంగా మలుపు తిరిగే అవకాశం ఉందనీ, స్పిన్న‌ర్ల‌కు అనుకూలించే ఇక్క‌డి గ్రౌండ్ ల‌లో ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్ తో భార‌త్ కు మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయ‌ని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డాడు. భారత్ ఇప్పటివరకు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ల‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో మెగా టోర్నమెంట్‌లోకి ప్రవేశించింది. అమెరికాతో పోలిస్తే వెస్టిండీస్‌లో స్పిన్నర్లకు మ‌రింత అనుకూలంగా పిచ్ ప‌రిస్థితులు ఉంటాయి కాబ‌ట్టి ఇక్క‌డ వీరు కీల‌క పాత్ర పోషించ‌వ‌చ్చు. దీంతో ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగే వ్యూహాల‌ను ర‌చిస్తోంది. 

Latest Videos

undefined

T20 WORLD CUP: ఒకే ఓవ‌ర్ లో 36 ప‌రుగులు.. యువ‌రాజ్ సింగ్ రికార్డు స‌మం చేశాడు

సూపర్-8లో భారత్ తన మొదటి మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది. గురువారం బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్ ఇప్పటి వరకు ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లను రంగంలోకి దించింది. అక్షర్ ప‌టేల్ ఇందులో విజయం సాధించాడు కానీ జడేజా మూడు మ్యాచ్‌ల్లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేయగలిగాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సుదీర్ఘకాలం కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్.. ఒకే తరహాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను జట్టులో ఉంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. 

టోర్నమెంట్ పురోగమిస్తున్న కొద్దీ వికెట్లు టర్న్‌ను అందిస్తే కుల్దీప్ యాద‌వ్ అదనపు వికెట్లు తీయగలడు అని ఫ్లెమింగ్ చెప్పాడు. కాబ‌ట్టి ముందున్న సిన్న‌ర్ల‌తో అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించాడు.  మిచెల్ సాంట్నర్, జడేజా చెన్నైకి ఇదే విధమైన పాత్ర పోషించార‌నీ, కొన్ని సందర్భాల్లో ఒకే రకమైన బౌలర్లతో ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయడం క‌ష్టంగానే ఉంటుంద‌నీ, అయితే, అందులో వైవిధ్యత ఉంటుంద‌ని చెప్పారు. కాబ‌ట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఇద్దరూ ప్రమాదకరమని నిరూపించవచ్చని జ‌డేజా, కుల్దీప్ ల‌ను గురించి ప్ర‌స్తావించారు. రాబోయే మ్యాచ్ ల‌లో జ‌డేజా, కుల్దీప్ లు భార‌త్ కు బ‌ల‌మైన బౌలింగ్ అటాక్ ను అందిస్తార‌ని ప్లెమింగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 

సిక్స‌ర్స్ కింగ్.. క్రిస్ గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన నికోల‌స్ పూర‌న్

click me!