INDvsENG: కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అవుట్... 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

Published : Mar 12, 2021, 07:16 PM IST
INDvsENG: కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అవుట్... 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

సారాంశం

ఒక్క పరుగుకే అవుటైన కెఎల్ రాహుల్... విరాట్ కోహ్లీ డకౌట్... మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...  

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ మొదటిసారి తొలి ఓవర్ వేసి, కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండో ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్, కెఎల్ రాహుల్‌ను అవుట్ చేసి, టీమిండియాకు షాక్ ఇచ్చాడు.

రెండో ఓవర్‌లో కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన టీమిండియా, పరుగులేమీ చేయలేకపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.

3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. 

PREV
click me!

Recommended Stories

virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే